Bank Holidays: ఈ ప్రాంతాల్లో రేపటి నుంచి రెండు రోజులు బ్యాంకులు బంద్…ఎక్కడెక్కడంటే..

|

May 12, 2021 | 2:42 PM

కరోనా వైరస్ దేశంలో కరాళ నృత్యం చేస్తున్న వేళ.. రాష్ట్రాలన్ని లాక్ డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి. ఇక ఇందులో భాగంగా బ్యాంకుల పనివేళలు

Bank Holidays: ఈ ప్రాంతాల్లో రేపటి నుంచి రెండు రోజులు బ్యాంకులు బంద్...ఎక్కడెక్కడంటే..
Banks ...
Follow us on

కరోనా వైరస్ దేశంలో కరాళ నృత్యం చేస్తున్న వేళ.. రాష్ట్రాలన్ని లాక్ డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి. ఇక ఇందులో భాగంగా బ్యాంకుల పనివేళలు కూడా కుదించబడిన సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. అయితే ఇక ఇదే సమయంలో మే నెలలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ప్రజలకు బ్యాంకులలో అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇప్పుడున్న లాక్ డౌన్ సమయంలో ముందుగా బ్యాంకులు ఏరోజున పనిచేస్తాయి.. ఏ రోజున సెలవులు అనే విషయాలు ముందుగానే తెలుసుకోవడం మంచిది.

ఇదిలా ఉంటే.. మే 13, 14 తేదీలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ రెండు రోజులను సెలవులుగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ప్రకటించారు. అయితే అన్ని రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవులు ఒకే విధంగా ఉండవు. రాష్ట్రం ప్రాతిపదికన మారుతూంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే మరో రాష్ట్రంలో హాలిడే ఉండకపోవచ్చు. కానీ గెజిటెడ్ సెలవులు మాత్రం దేశంలో ఉన్న బ్యాంకులు పాటిస్తాయి. మే 13న రంజాన్ ఐడీ (ఈద్ ఉల్ ఫితర్) కారణంగా బేలాపూర్, జమ్మూ, కొచ్చి, ముంబై, నాగ్ పూర్, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులు బంద్ కానున్నాయి.

ఇక మే 14న భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి, రంజాన్, బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. అగర్తాలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీఘర్, చెన్నై, డెహ్రాడూన్, గాంగ్టక్, గువహతి, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీ, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా ఏరియాలలో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక ఇవే కాకుండా.. మే నెలలో మరిన్ని సెలవులు ఉన్నాయి.

16 మే: ఆదివారం
22 మే: నాల్గవ శనివారం
23 మే: ఆదివారం
26 మే: బుద్ధ పౌర్నిమ
30 మే: ఆదివారం

Also Read: బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇకపై నచ్చిన నెంబర్‏తోనే అకౌంట్.. ఆ బ్యాంకులో కొత్త సేవలు…

వినియోగదారులకు అలర్ట్.. మరో ట్విస్ట్ ఇచ్చిన వాట్సప్.. ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఆ సర్వీసులు పొందలేరు..