Additional taxes with farm cess :కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి మాత్రం మరింత షాక్ ఇచ్చింది. డ్యూటీలు తగ్గించి.. సెస్సులు పెంచడం వల్ల ఒరిగింది ఏదీలేదు. ఒకటి రెండు విషయాల్లో ఊరట తప్ప అంతా షాకుల మీద షాకులే. అగ్రి అండ్ ఇఫ్రా డెవలెప్‌మెంట్ సెస్ పేరుతో భారీగా వడ్డించారు. ఓవైపు గోల్డ్ సిల్వర్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూనే మరోవైపు పెంచేశారు. గోల్డ్ సిల్వర్‌పై 2.5శాతం అగ్రిసెస్ వేశారు. ఇక ఆల్కహాల్‌పై వందశాతం సెస్ విధించారు. దీంతో ప్రతీ వంద రూపాయల బాటిల్‌పై పదిరూపాయల ధర పెరగనుంది.
ఇక క్రూడ్ పామాయిల్‌పై 17.5శాతం సెస్ విధించారు. క్రూడ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 20శాతం సెస్ పడింది. దీంతో వంటనూనెల ధరలు భారీగా పెరగనున్నాయి. యాపిల్ ధరలపై 35శాతం సెస్ విధించబోతున్నారు. దీంతో కశ్మీర్, సిమ్లా యాపిల్స్ ధరలు మండిపోనున్నాయి. బొగ్గు, లిగ్నైట్ ,పీట్‌పై ఒకటిన్నర శాతం.. కొన్నిరకాల ఫెర్టిలైజర్ల పై 5శాతం.. కాటన్‌పై 5శాతం సెస్ పడబోతోంది. ఇక బఠానీపై 40శాతం, పల్లీలపై 30శాతం, పప్పుదినుసులపై 50శాతం అగ్రిసెస్ పడబోతోంది.
అయితే, ఈ సెస్ ఎలా విధించబోతున్నారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. దీన్ని ప్రభుత్వమే భరిస్తుందని అధికారిక వర్గాలంటున్నాయి. అగ్రిసెస్ పేరుతో పెట్రోల్ ధరలూ పెరగబోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్నిరకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. అత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈ సెస్ ద్వారా వ్యవసాయ, నిర్మాణ రంగానికి భారీగా నిధులు కేటాయించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఎంఎస్‌పీలను నిర్ణయించడం.. ఇక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. అయితే ప్రభుత్వాధినేతలు మాత్రం ఈ సెస్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు.
Read Also.. Union Budget 2021 Telugu Live: కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్