ప్రాక్టీసులో కోహ్లీ స్ట‌న్నింగ్ క్యాచ్

|

Sep 05, 2020 | 5:21 PM

త్వరలో ఐపీఎల్ మొద‌లుకాబోతుంది. ఈ సీజ‌న్ కోసం అన్ని జ‌ట్లు ఇప్ప‌టికే దుబాయ్ చేరుకున్నాయి. క‌ఠోర సాధ‌న చేస్తూ క‌ప్ ద‌క్కించుకోవాల‌ని ప్ర‌తి జ‌ట్టు భావిస్తోంది.

ప్రాక్టీసులో కోహ్లీ స్ట‌న్నింగ్ క్యాచ్
Follow us on

త్వరలో ఐపీఎల్ మొద‌లుకాబోతుంది. ఈ సీజ‌న్ కోసం అన్ని జ‌ట్లు ఇప్ప‌టికే దుబాయ్ చేరుకున్నాయి. క‌ఠోర సాధ‌న చేస్తూ క‌ప్ ద‌క్కించుకోవాల‌ని ప్ర‌తి జ‌ట్టు భావిస్తోంది. క‌రోనా లాక్‌డౌన్ ప్రభావంతో దాదాపు ఐదు నెలలకు పైగా ఇంట్లోనే ఉన్న క్రికెటర్లు.. గ్రౌండ్‌లో చెమ‌ట‌లు చిందిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ​విభాగాల్లో రాటుదేలుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ అద్భుతంగా క్యాచ్​ పట్టిన వీడియోను ఆర్​సీబీ ట్వీట్ చేస్తూ, ఈ సమయంలో చెప్పాల్సింది ఏం లేదు అని ఓ సరదా కామెంట్‌ను జోడించింది. ప్రాక్టీస్ అప్పుడే ఇలా ఉంటే మ్యాచ్​ల్లో చెలరేగిపోతాడేమో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్‌ మ్యాచ్​లు జరగనున్నాయి. ఇందుకోసం దుబాయ్, షార్జా, అబుదాబీ మైదానాలు రెడీ అయ్యాయి.

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ప్రాణం తీసిన స్కూటీ స్టాండ్

జిమ్ ట్రైన‌ర్‌కు రేంజ్ రోవ‌ర్ గిఫ్ట్‌గా ఇచ్చిన డార్లింగ్