కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా తన పెద్ద మనసు చాటుకున్నారు. ఓ పేద బాలిక ప్రాణాలు కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ రెండున్నరేళ్ల బాలిక తీవ్రమైన వ్యాధితో బాధపడుతోందని తెలిసింది. ఆ రెండున్నరేళ్ల బాలిక వ్యథ విని చలించిపోయిన ప్రియాంకాగాంధీ వెంటనే ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని సూచించారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్‌ను ఏర్పాటు చేయించారు. యూపీ నుంచి వారు ఢిల్లీ చేరుకునేలోగా ఎయిమ్స్ ఆస్పత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. బాలిక ఢిల్లీలో దిగి ఎయిమ్స్‌కు వెళ్లేలోపు అక్కడ వైద్యులు ట్రీట్‌మెంట్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా తెలిపారు.