‘కంబలపల్లి కథలు’ చెబుతానంటోన్న ప్రియదర్శి

|

Sep 13, 2020 | 9:12 PM

ప్రముఖ టాలీవుడ్​ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్​కు అనుబంధంగా ఉన్న స్వప్న సినిమాస్.. 'కంబలపల్లి కథలు' అనే సరికొత్త వెబ్​ సిరీస్​ తెరకెక్కిస్తోంది.

కంబలపల్లి కథలు చెబుతానంటోన్న ప్రియదర్శి
Follow us on

ప్రముఖ టాలీవుడ్​ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్​కు అనుబంధంగా ఉన్న స్వప్న సినిమాస్.. ‘కంబలపల్లి కథలు’ అనే సరికొత్త వెబ్​ సిరీస్​ తెరకెక్కిస్తోంది. ఇందులో ​ కమెడియన్​ ప్రియదర్శి కీలక పాత్ర పోషించనున్నాడు. ఆదివారం షూటింగ్​ స్టార్ట్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ద్వారాా పంచుకున్నాడు ప్రియదర్శి. గ్రామీణ నేపథ్యంలో రూపొందించనున్న ఈ సిరీస్​లో హైబత్​ అనే పాత్రలో ప్రియదర్శి నటించనున్నాడు. ఉదయ్​ గుర్రాలా ఈ సిరీస్​తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రయాణం మొదలుపెట్టి.. ‘పెళ్లిచూపులు’ సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి.. ఇటీవలే ‘మల్లేశం’  సినిమాలో అద్బుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Also Read :

దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు

“వెయిటర్‌గా పనిచేస్తున్నప్పుడు, టిప్పుగా ఓ మహిళ కిస్ పెట్టింది”