మణిపూర్ లో జూలై 15వరకు లాక్‌డౌన్‌

|

Jun 28, 2020 | 10:00 PM

మణిపూర్‌లో జూలై 15వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్‌సింగ్‌ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మరో 15రోజలపాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.

మణిపూర్ లో జూలై 15వరకు లాక్‌డౌన్‌
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. దీంతో మరోసారి అయా ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలు చేపడుతున్నాయి. తాజాగా మణిపూర్‌లో జూలై 15వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్‌సింగ్‌ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మరో 15రోజలపాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,092 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 660 యాక్టివ్‌ కేసులుండగా, 432మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అటు, ఝార్కండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే లాక్ డౌన్ తో నే కొవిడ్ వ్యాప్తి అరికట్టవచ్చని స్పష్టం చేస్తున్నాయి.