కోవిడ్ చికిత్స‌లో స‌త్తా చాటుతోన్న నిజామాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు

|

Aug 12, 2020 | 12:06 PM

నిజామాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు కోవిడ్ చికిత్సలో స‌త్తా చాటుతున్నాయి. గ‌త రెండు నెల‌ల కాలంలో నిజామాబాద్ గ‌వ‌ర్న‌మెంట్ ఆస్పత్రి ఐసీయూ నుంచి 109 మంది వ్యాధి న‌య‌మై డిశ్చార్జ‌య్యారు.

కోవిడ్ చికిత్స‌లో స‌త్తా చాటుతోన్న నిజామాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు
Follow us on

Covid-19 Treatment : నిజామాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు కోవిడ్ చికిత్సలో స‌త్తా చాటుతున్నాయి. గ‌త రెండు నెల‌ల కాలంలో నిజామాబాద్ గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రి ఐసీయూ నుంచి 109 మంది వ్యాధి న‌య‌మై డిశ్చార్జ‌య్యారు. వారిలో దాదాపు 50 మంది వెంటిలేట‌ర్ సపోర్ట్‌తో ట్రీట్మెంట్ అందుకున్నవారు కూడా ఉన్నారు. దాదాపు 10 రోజుల పాటు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందుకుని కూడా వీరు వ్యాధిని జ‌యించారు. ఐసీయూలో అడ్మిట్ అయిన క‌రోనా పేషెంట్స్ రిక‌వ‌రీ రేటు ఏకంగా 90 శాతంగా ఉంది.

ఆస్ప‌త్రి డేటా ప్ర‌కారం కోవిడ్ బాధితుల రిక‌వ‌రీ రేటు 40 శాతంగా ఉంది. ఇత‌ర ఆస్ప‌త్రుల‌తో పోల్చుకుంటే ఇది రెట్టింపు శాతం. వ్యాధిపై స‌మ‌ర్థ‌వంతంగా పనిచేస్తోన్న రెమిడిసివిర్, పావిపిరవిర్ టాబ్లెట్ల‌ను గ‌వ‌ర్న‌మెంట్ త‌మ‌కు పంప‌కముందే, జిల్లా క‌లెక్ట‌ర్ ఫండ్స్ ద్వారా తెప్పించి కోవిడ్ పేషెంట్ల‌కు అంద‌జేసిన‌ట్టు హాస్పిట‌ల్ ఐసీయూ ఇన్‌ఛార్జ్ డాక్ట‌ర్ కిర‌ణ్ తెలిపారు. వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ త‌ర్వాత ఎటువంటి ఆరోగ్య స‌మస్య‌లు వ‌చ్చిన‌ట్టు త‌మ వ‌ద్ద‌కు రాలేద‌‌ని వెల్ల‌డించారు. క్రిటిక‌ల్ కేసుల విష‌యంలో డాక్ట‌ర్స్, పేషెంట్స్ మ‌ధ్య న‌మ్మ‌క‌మే రిక‌వ‌రీ విష‌యంలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఆస్ప‌త్రి సూపరింటెండెంట్ డాక్ట‌ర్ ప‌ద్మ‌జా రాజ్ తెలిపారు.

 

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”