Breaking : సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం, వైఎస్ భారతి తండ్రి కన్నుమూత

|

Oct 03, 2020 | 7:10 AM

ప్రముఖ వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయానా మామ ఈసీ చిన్న గంగిరెడ్డి కన్నుమూశారు. చిన్న గంగిరెడ్డి జగన్ సతీమణి భారతి  తండ్రి. 

Breaking : సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం, వైఎస్ భారతి తండ్రి కన్నుమూత
Follow us on

ప్రముఖ వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయానా మామ ఈసీ చిన్న గంగిరెడ్డి కన్నుమూశారు. చిన్న గంగిరెడ్డి జగన్ సతీమణి భారతి  తండ్రి అన్న విషయం తెలిసిందే.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి, హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పులివెందులలో పేదల వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. ఈసీ గంగిరెడ్డి మరణంలో సీఎం జగన్ నివాసంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవలే సీఎం జగన్ ప్రత్యేకంగా హైదరాబాద్  వెళ్లి ఆస్పత్రిలో ఉన్న తన మామను పరామర్శించి వచ్చారు. (జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్, అందుకు గ్రీన్ సిగ్నల్)