సీఎం గన్‌మాన్ అంటూ చిల్లర చీటింగ్.. పోలీసులేం చేశారంటే..?

|

Nov 07, 2020 | 7:48 PM

ముఖ్యమంత్రితో కే.చంద్రశేఖర్ రావుతో సన్నిహితంగా వున్నానంటూ మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేసి.. జనాన్ని నిట్టనిలువునా ముంచిన ఓ చిల్లర చీటర్‌ని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

సీఎం గన్‌మాన్ అంటూ చిల్లర చీటింగ్.. పోలీసులేం చేశారంటే..?
Follow us on

Cheating in the name of CM gunman: సీఎం గన్ మాన్ అంటూ చిల్లర మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం వద్ద గన్ మాన్ గా పని చేస్తున్నానంటూ ప్రభుత్వ, ఔట్ సోర్చింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ సంతోష్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. సంతోష్ ట్రాప్‌లో దాదాపు 50 మందికి పైగా పడిపోయారని తెలుస్తోంది.

క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ ఎస్సై పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడీ సంతోష్. సీఎం పక్కనే ఉన్నట్టు ఫోటో‌‌ను మార్ఫింగ్ ద్వారా క్రియేట్ చేసి.. దానిని చూపుతూ మోసాలకు పాల్పడుతున్నాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్ వద్ద నుండి బొమ్మ తుపాకీ, డూప్లికేట్ ఎస్సై ఐడెంటిటీ కార్డు, సఫారీ డ్రెస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రగతి భవన్ వద్ద వీధుల్లో ఉన్నట్టు ఫోటోలను పంపి నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాడని చెబుతున్నారు.

సంతోష్ వద్ద నుండి 30 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఎంవో అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండగా.. గతంలోను వరంగల్ జిల్లా పాలకుర్తి, హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లలో సంతోష్‌పై చీటింగ్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.

ALSO READ: సినీ లవర్స్‌కు కేసీఆర్ ఒకే రోజు 2 గుడ్‌న్యూస్

ALSO READ: కేంద్రం ఒక్క పైసా ఇవ్వలే.. మండిపడ్డ కేసీఆర్

ALSO READ: బీహార్‌లో అధికారం వారిదే.. తేల్చిన ఎగ్జిట్ పోల్స్

ALSO READ: జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.. ‘ఆ’ వ్యర్థాలకు రీసైక్లింగ్‌తో చెక్

ALSO READ: జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస

ALSO READ: నాగేంద్రకు 14 రోజుల రిమాండ్