సీఎం జగన్‌కు బాబు లేఖ, కంటెంట్ ఇదే

|

Oct 14, 2020 | 4:11 PM

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

సీఎం జగన్‌కు బాబు లేఖ, కంటెంట్ ఇదే
Follow us on

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు పోటెత్తుతుంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపడుతున్నాయి. నేతలు ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  ఈ క్రమంలో ఏపీలో వర్షం బీభత్సంపై సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. ( హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్‌: 3 రోజులు బయటకు రావొద్దు )

వరదల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. దెబ్బతిన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచించారు. పంటల నష్టం అంచనా యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని కోరారు. వలలు, పడవల కొనుగోళ్లకు ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందించాలని.. కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేయాలని సీఎంను కోరారు. (వైఎస్‌ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం నిధులు విడుదల )