క్యాంపెయిన్ మేనేజర్‌ను తొలగించిన ట్రంప్

ప్రతిష్టాత్మకంగా జరగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచార నిర్వాహకుడు బ్రాడ్ పార్స్‌కేల్ ను అర్థంతరంగా తొలగించడం వివాదాస్పదంగా మారింది. ప్రచార సభకు జనసమీకరణలో విఫలమైనందుకు అతనిపై వేటు పడినట్లు భావిస్తున్నారు.

క్యాంపెయిన్ మేనేజర్‌ను తొలగించిన ట్రంప్
Follow us

|

Updated on: Jul 16, 2020 | 6:32 PM

ప్రతిష్టాత్మకంగా జరగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచార నిర్వాహకుడు బ్రాడ్ పార్స్‌కేల్ ను అర్థంతరంగా తొలగించడం వివాదాస్పదంగా మారింది. ప్రచార సభకు జనసమీకరణలో విఫలమైనందుకు అతనిపై వేటు పడినట్లు భావిస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్… తన ప్రచార కార్యక్రమాల నిర్వాహకుడు(క్యాంపెయిన్ మేనేజర్) బ్రాడ్ పార్స్‌కేల్ ని బాధ్యతల నుంచి తొలగించారు. ఇకపై అతను మా బృందానికి సేవలు అందించరు’ అని ట్రంప్ బృందం అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే, గత నెలలో ఓక్లహోమాలో నిర్వహించిన ర్యాలీకి జనసమీకరణ పేలవంగా ఉందని సభ నిర్వహణలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే పార్స్‌కేల్ ఉద్వాసనకు కారణమై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ర్యాలీకి ఒక మిలియన్ మందికి పైగా హాజరు అవుతారని తెలిపిన పార్స్‌కేల్, కేవలం 6,200 కన్నా తక్కువ మంది అరేనాలో కనిపించారని స్థానిక అగ్నిమాపక విభాగం అధ్యక్షుడు ట్రంప్ నివేదిక ఇచ్చింది. దీంతో అతనిపై వేటు పడినట్లు తెలుస్తోంది.

“చాలా కాలం నాతో ఉన్న మరియు మా అద్భుతమైన డిజిటల్, డేటా వ్యూహాలకు నాయకత్వం వహించిన బ్రాడ్ పార్స్‌కేల్, ఆ పాత్రలో కొనసాగుతారని, మిగతా ప్రచారానికి సీనియర్ సలహాదారుగా ఉన్నారని” ఫేస్‌బుక్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

2016లో జరిగిన ఎన్నికల ప్రచారం సమయంలో ఫీల్డ్ డైరెక్టర్ బిల్ స్టెపియన్‌ను తొలగించి బ్రాడ్ పార్స్‌కేల్ క్యాంపెయిన్ మేనేజర్ గా నియమించకున్నారు ట్రంప్. ఇదిలావుంటే, తుల్సాలో అధ్యక్షుడి పునరాగమన ర్యాలీ ఫ్లాప్ అయిన తరువాత కొద్ది వారాలుగా తనను పక్కకు పెడుతున్నారని పార్స్‌కేల్ చెబుతున్నారు. తనను తొలగించడానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్, వైట్ హౌస్ సలహాదారులు ఇద్దరూ కారణమని పార్స్‌కేల్ ఆరోపించారు.