‘కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి’

|

Oct 14, 2020 | 7:37 PM

ఎడతెరిపి లేని భారీ వర్షాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్

కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
Follow us on

Jagan Review Meeting: ఎడతెరిపి లేని భారీ వర్షాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కృష్ణాలో వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో ఇళ్లను ఖాళీ చేయించేవారికి ఖచ్చితంగా వసతి చూపించాలని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజ్‌కి ఏడున్నర లక్షల వరద వచ్చే అవకాశం ఉందన్నారు.

వర్షాలు తగ్గినందున విద్యుత్‌ పునరుద్దరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మత్తు పనులు అంతే వేగంగా చేయాలన్నారు. వర్షాల వల్ల ప్రబలే వ్యాధులపై దృష్టి పెడుతూనే ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి సాయం అందించాలని, తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే వారం రోజుల్లో పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Also Read: ఆ గుడిలో భక్తులకు బంగారమే ప్రసాదం.!