లాటరీలో కోటి తగిలిందంటూ ఫోన్, ఆపై స్టార్టవుతుంది గేమ్

|

Sep 30, 2020 | 2:23 PM

కోటి రూపాయల లాటరీ తగిలిందంటూ మీకు ఫోన్ వస్తుంది. వెంటనే ఎగిరి గంతేయకండి. అదంతా ఫేక్. అసలు మీరు లాటరీ కొనకుండా డబ్బు ఎలా వస్తుంది.

లాటరీలో కోటి తగిలిందంటూ ఫోన్, ఆపై స్టార్టవుతుంది గేమ్
Follow us on

కోటి రూపాయల లాటరీ తగిలిందంటూ మీకు ఫోన్ వస్తుంది. వెంటనే ఎగిరి గంతేయకండి. అదంతా ఫేక్. అసలు మీరు లాటరీ కొనకుండా డబ్బు ఎలా వస్తుంది. ఇవన్నీ చిన్న, చిన్న విషయాలు..కాస్త మైండ్ పెట్టి ఆలోచిస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఫోన్ రాగానే సంబరపడిపోయి..వాళ్లు అడిగిందల్లా చేశారా, విచారించడానికి పెద్ద సమయం పట్టదు. తాజాగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో ఇటువంటి ఘటనే జరిగింది. ముందుగా కోటి రూపాయలు లాటరీ వచ్చిందంటూ ఫోన్ వచ్చింది. ఆపై ముందే జీఎస్టీ కట్టాలంటూ లక్షల రూపాయలు నగదు దండుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే,  ముట్లూరుకు చెందిన చైతన్యకు ఆగస్టు 31న ఎస్.బి.ఐ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ వచ్చింది. మీకు కోటి 24 లక్షల రూపాయలు లాటరీ వచ్చిందంటూ చాలాసార్లు ఫోన్ చేయసాగారు. లాటరీ వచ్చిన డబ్బు ఇవ్వాలంటే రూ.8 లక్షలు జీఎస్టీ కట్టాలని చెప్పారు. నిజమే అనుకుని నమ్మిన బాధితుడు…సెప్టెంబర్ 1 నుంచి 27తేదీల మధ్య దశల వారీగా రూ.8 లక్షలు వారి బ్యాంకు అకౌంట్లకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా జమ చేశాడు. ఆ తరువాత నుంచి వాళ్ల ఫోన్ నెంబర్ పని చేయకపోవడం.. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు పిర్యాదు చేశాడు.

ఇదే మండలంలో గారపాడు గ్రామానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత నెల రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి స్వయంగా బ్యాంకుకు వెళ్లి రూ.13 లక్షలు సైబర్ కేటుగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేసింది. అనంతరం వారి ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో విషయం బోధపడి .. సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read :

సివిల్ సర్వీసెస్ పరీక్షల వాయిదాకు సుప్రీం నిరాకరణ

టీటీడీ అర్చకునికి 6 నెలల జైలు శిక్ష