బాలీవుడ్ హీరోయిన్ సూసైడ్.. ఇంట్లోనే..

Bollywood Actress Preksha Mehta: బాలీవుడ్ హీరోయిన్ ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రేక్ష బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం (మే 25న) రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు సన్నిహితులు చెప్పారు. ‘క్రైం పెట్రోల్’, ‘లాల్ ఇష్క్’, ‘మేరి దుర్గ’ వంటి టీవీ షోలలో ప్రేక్ష నటించారు. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘ప్యాడ్ మ్యాన్’లోనూ ఒక పాత్ర పోషించారు. ఆమె వయసు 25 సంవత్సరాలు. చిన్న వయసులోనే […]

బాలీవుడ్ హీరోయిన్ సూసైడ్.. ఇంట్లోనే..
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 12:17 PM

Bollywood Actress Preksha Mehta: బాలీవుడ్ హీరోయిన్ ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రేక్ష బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం (మే 25న) రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు సన్నిహితులు చెప్పారు. ‘క్రైం పెట్రోల్’, ‘లాల్ ఇష్క్’, ‘మేరి దుర్గ’ వంటి టీవీ షోలలో ప్రేక్ష నటించారు. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘ప్యాడ్ మ్యాన్’లోనూ ఒక పాత్ర పోషించారు. ఆమె వయసు 25 సంవత్సరాలు. చిన్న వయసులోనే ఒక మంచి నటి కన్నుమూయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

వివరాల్లోకెళితే.. ప్రేక్ష సోమవారం రాత్రి ఉరివేసుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం చూశారు. ఫ్యాన్‌కు వేలాడుతోన్న ప్రేక్ష శరీరాన్ని మొదటిసారిగా ఆమె తండ్రి చూశారు. వెంటనే ఆమెను కిందికి దించి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ప్రేక్ష మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. ప్రేక్ష గదిలో సూసైడ్ నోట్ దొరికిందని, అయితే, దానిలో తన ఆత్మహత్యకు గల కారణాన్ని రాయలేదని తెలిసింది.

మరోవైపు.. ప్రేక్ష ఆత్మహత్య చేసుకోవడానికి ముందు, అంటే ఆఖరిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్ష ఒక మెసేజ్ పెట్టారు. ‘‘కలలు చనిపోవడం చాలా బాధ కలిగిస్తుంది’’ అని హిందీలో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.