Breaking News
  • కర్నూలు: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాకం. మహిళకు ఆపరేషన్‌ చేసి కడుపులో దూదిని మర్చిపోయిన డాక్టర్లు. డాక్టర్ల తీరుపై బాధిత బంధువుల ఆందోళన.
  • హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ దగ్గర ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష. ఎమ్మార్పీఎస్‌ మహాదీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ. నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మందకృష్ణ అరెస్ట్‌. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మార్పీఎస్‌.
  • వనపర్తి: పెబ్బేరు బైపాస్‌లో ఆటోను ఢీకొన్న కారు. ఒకరు మృతి, మరో ముగ్గురికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • తూ.గో: కాకినాడలో అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష. విషజ్వరాలు అధికంగా ఉన్న చోట స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపట్టాలి. ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరతను త్వరలో పరిష్కరిస్తాం. తూ.గో.జిల్లాలో రూ.250 కోట్లతో మంచినీటి పథకం అమలుచేస్తాం. అర్హులందరికీ త్వరలో ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తాం-మంత్రి కన్నబాబు.
  • హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ దగ్గర ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష. ఎమ్మార్పీఎస్‌ మహాదీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ. నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మందకృష్ణ అరెస్ట్‌. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మార్పీఎస్‌.
  • కరీంనగర్‌: కలెక్టర్‌ ఆడియో టేపుల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌. వివరాలు సేకరిస్తున్న సీఎంఓ అధికారులు. ఇప్పటికే ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌.
  • ఉత్తరాఖండ్: సాయంత్రం బద్రీనాథ్‌ ఆలయం మూసివేత. చివరిరోజు కావడంతో భారీగా దర్శించుకుంటున్న భక్తులు.

చెన్నైలో బతుకమ్మ సంబురాలు.. ఆటపాటలతో ఆడపడుచుల సందడి..!

చెన్నైలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లా పాపలు, మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో హోరెత్తించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. వరంగల్‌ జిల్లాకు చెందిన వందలాది కుటుంబాలు 40 ఏళ్ల క్రితం చెన్నైలో స్థిరపడ్డారు. ప్యారీస్‌, షాపుకారుపేట, బ్రాడ్‌ వే, ఉత్తర చెన్నై తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు, చిన్నా చితక వ్యాపారులు అక్కడే ఉంటున్నారు. అయితే కులాలకు అతీతంగా తెలంగాణ సంఘాన్ని ఏర్పాటు చేసి గత ఏడేళ్లుగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మలే కాదు… తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను కూడా వారంతా ఘనంగా జరుపుకుంటారు.

ప్రతి ఏడాది విరాళాలు సేకరించి.. బతుకమ్మ వేడుకలను జరుపుతుంటారు. మైదానంలో తీరొక్క పూలతో కొలువుదీరిన బతుకమ్మలు, ఆటపాటలు… డీజేల హోరుల మధ్య అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ వారితో పాటు.. తమిళనాడుకు చెందిన వారు కూడా ఈ సంబురాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.