
ప్రేమ జీవితానికి, ప్రేమ పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు తన స్వక్షేత్ర, మిత్ర క్షేత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు ప్రేమ జీవితం ప్రారంభం అవుతుంది. ప్రేమ ప్రయత్నాలు సఫలమవు తాయి. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది అనుకూలమైన సమయం. వచ్చే ఏడాది జనవరి 2 వరకు తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి వల్ల ఇవన్నీ వెలుగు చూస్తాయి. కొన్ని రాశుల వారికి ప్రయత్నపూర్వకంగానూ, అప్రయత్నంగానూ ప్రేమ జీవితం ప్రారంభం కావడం, అది పెళ్లికి దారితీయడం జరుగుతుంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి శుక్ర సంచారం వల్ల ప్రేమ యోగం పట్టే అవకాశం ఉంది.
ఈ రాశికి సప్తమంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఈ రాశివారికి అనుకోకుండా ప్రేమ జీవితం ప్రారంభం అవుతుంది. సాధారణంగా సహోద్యోగితో ప్రేమ జీవితం ప్రారంభం అవుతుంది. పరిచయ స్థులు లేదా దగ్గర బంధువుతో ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ జీవితంలో విహార యాత్రలు, పర్యటనలు, కానుకలకు బాగా ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రేమ జీవితం నవంబర్ ప్రాంతంలో పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. పెద్దల అనుమతితో వివాహం జరుగుతుంది.
ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడడానికి, ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. సాధారణంగా పరిచయస్థు లతో లేదా ఇరుగు పొరుగువారితో ప్రేమలో పడడానికి అవకాశం ఉంది. నవంబర్, ఫిబ్రవరి నెలల మధ్య వీరి ప్రేమ జీవితం పెళ్లి జీవితంగా మారుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మధ్య మధ్య అపార్థాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ సంప్రదాయబద్ధంగా వీరి పెళ్లి జరుగుతుంది.
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో పాటు నీతి నిజాయతీలకు కట్టుబడి ఉండే ఈ రాశివారికి ప్రస్తుతం శుక్రుడు కుటుంబ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. సాధారణంగా బంధువుతో లేదా కుటుంబానికి తెలిసిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, రెండు నెలల వ్యవధిలో పెళ్లి కావడం జరుగుతుంది. ప్రేమ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు ప్రేమ జీవితంలో ప్రవేశించడం తప్పకుండా జరుగుతుంది. సాధారణంగా సహోద్యోగితో ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రేమ జీవితాన్ని సరదాగా, సంతోషంగా గడపడానికి వీరు ప్రాధాన్యం ఇస్తారు. జనవరి లోగా వీరి ప్రేమ వ్యవహారం పెళ్లిగా మారే అవకాశం ఉంది. శుక్రుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారితో ప్రేమ జీవితమైనా, పెళ్లి జీవితమైనా నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది.
ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడి స్వక్షేత్ర సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ప్రేమ జీవితం ఏర్పడుతుంది. ప్రేమ జీవితాన్ని అన్ని విధాలా ఆనందంగా గడపడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారు నవంబర్ ప్రాంతంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. విందులు, వినోదాలతో పాటు, విహార యాత్రలతో వీరి ప్రేమ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో లేదా సహోద్యోగితో ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి ప్రేమ భాగ్యం కలుగుతుంది. సాధారణంగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో గానీ, దూరపు బంధువుతో గానీ ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో అక్టోబర్ లో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ, పెద్దల అను మతితో వీరి పెళ్లి జీవితం ప్రారంభమవుతుంది. ప్రేమ జీవితంలో విహార యాత్రలు, విలాసాలు, వినోదాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రేమ జీవితంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది.