AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Blessings: శుక్రుడి నక్షత్ర మార్పు..ఆ రాశుల వారికి 18 రోజులు తిరుగే ఉండదు..!

Shukra Nakshatra Transit: ఆగస్టు 25న శుక్రుడు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. సుమారు 18 రోజుల పాటు సాగే ఈ నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మేషం, వృశ్చికం, మీన రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, ప్రేమ, సంబంధాల విషయంలో శుభ ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో కొత్త అవకాశాలు, ఆదాయ మార్గాలు, కెరీర్‌లో పురోగతి కలిసివచ్చే అవకాశముంది.

Shukra Blessings: శుక్రుడి నక్షత్ర మార్పు..ఆ రాశుల వారికి 18 రోజులు తిరుగే ఉండదు..!
Shukra Nakshatra Transit
Janardhan Veluru
|

Updated on: Aug 20, 2026 | 6:32 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ప్రేమ, సంబంధాలు, సుఖసౌకర్యాలు, ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత ఉంది. గ్రహాల రాశి, నక్షత్ర మార్పులు వ్యక్తుల జీవితంపై తప్పకుండా ప్రభావం చూపుతాయని జ్యోతిష్యులు భావిస్తారు. ఈ క్రమంలో ఆగస్టు 25, 2026న శుక్రుడు నక్షత్ర మార్పు చేయనున్నాడు. ప్రస్తుతం హస్త నక్షత్రంలో ఉన్న శుక్రుడు.. ఆగస్టు 25న కుజుడికి చెందిన చిత్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ సుమారు 18 రోజుల పాటు కొనసాగనున్నాడు. ఈ నక్షత్ర మార్పు అన్ని రాశులపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా మేషం, వృశ్చికం, మీన రాశుల వారికి ఈ కాలం ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం, సంబంధాల విషయంలో సానుకూల ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం.

మేష రాశి

శుక్రుడి నక్షత్ర మార్పు మేష రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆదాయానికి సంబంధించిన కొత్త అవకాశాలు కనిపించవచ్చు. సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకునే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కే అవకాశముంది. ఈ బాధ్యతలు భవిష్యత్తులో కెరీర్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపారులకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి రావడంతో ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశముంది. వ్యక్తిగత సంబంధాల్లో కూడా సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు కెరీర్ పరంగా మంచి అవకాశాలను తీసుకురావచ్చని జ్యోతిష్య అంచనా. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావడం లేదా పని విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఆగస్టు 25 తర్వాతి 18 రోజులు వృశ్చిక రాశి వారికి ఉపశమనం కలిగించే కాలంగా ఉండవచ్చని చెబుతున్నారు.

మీన రాశి

గురువు ఆధిపత్యంలోని మీన రాశికి కూడా శుక్రుడి నక్షత్ర మార్పు అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగంలో పరిస్థితులు మెరుగుపడటంతో పాటు కార్యాలయంలో మీ పనికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. దీంతో ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని అంచనా. అయితే ఈ సమయంలో అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనంలోని జ్యోతిష్య అంశాలు విశ్వాసాలు, సంప్రదాయాలపై ఆధారపడ్డవి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన వాస్తవాలుగా పరిగణించకూడదు.

Follow Us