
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..
ఆదాయం-2, వ్యయం-8 | రాజపూజ్యం-4, అవమానం-2
ధన స్థానంలో రాశ్యధిపతి శని, పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. జూన్ మొదటి వారం నుంచి ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. కొద్దిగా ఆస్తి లాభం కలుగుతుంది. తండ్రి నుంచి సంపద లభించే అవకాశం కూడా ఉంది.
వృత్తి, ఉద్యోగాలుః ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల వంటి విషయాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇతర గ్రహాల కారణంగా కొంత కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అయితే, ధన స్థానంలో శని కారణంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు కొద్ది కష్టంతో సానుకూలపడతాయి. నిత్య జీవితంలో యాక్టివిటీ పెరుగు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినా గుర్తింపు ఉండకపోవచ్చు.
కుటుంబ వ్యవహారాలుః వ్యక్తిగత పనుల వల్ల ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. శుభ కార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. సతీమణితో కలిసి వస్త్రాభ రణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. కొందరు మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు మధ్య మధ్య ఇబ్బంది పెడతాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి