
జ్యోతిషశాస్త్రంలో శని, గురు గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండు గ్రహాల కదలికలు వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. 2026 డిసెంబర్‌లో కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ రెండు కీలక గ్రహాల సంచారంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. డిసెంబర్ 11న శనీశ్వరుడు మీన రాశిలో మార్గ సంచారం (Shani Margi) లోకి రానుండగా.. డిసెంబర్ 13న గురుడు సింహ రాశిలో వక్రగమనం (Guru Vakri)లోకి ప్రవేశించనున్నాడు.
శనీశ్వరుడిని కర్మ, న్యాయానికి కారకుడిగా పరిగణిస్తారు. శని మార్గ సంచారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు మారొచ్చు. వ్యాపారంలో గతంలో నిలిపివేసిన ప్రణాళికలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే అనుకున్న ఫలితాలు పొందాలంటే కష్టపడి పనిచేయడం, ఓర్పుతో వ్యవహరించడం అవసరం. ఈ గ్రహ మార్పుల వల్ల 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
గురువును జ్ఞానం, సంపద, విద్య, వివాహానికి కారకుడిగా భావిస్తారు. గురుడు వక్రగమనంలోకి వెళ్లినప్పుడు ఈ అంశాలకు సంబంధించిన విషయాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. వ్యాపారస్తులు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచించడం మంచిది.
మేష రాశి: ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. పాత పరిచయాల ద్వారా వ్యాపారంలో లాభాలు రావచ్చు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృషభ రాశి: కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి.
మిథున రాశి: ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగవచ్చు. అధికారుల నుంచి కొత్త బాధ్యతలు అందుతాయి. వ్యాపారంలో పాత సమస్య మళ్లీ తెరపైకి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
కర్కాటక రాశి: అదృష్టం కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో విజయం సాధించవచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం.
సింహ రాశి: ఈ రాశిలోనే గురుడు వక్రగమనంలోకి మారనున్నాడు. దీంతో గతంలో తీసుకున్న నిర్ణయాలను మరోసారి సమీక్షించుకునే పరిస్థితులు రావచ్చు. ఉద్యోగ మార్పు, వ్యాపార విస్తరణ వంటి విషయాల్లో తొందరపడకూడదు. ఆర్థికంగా రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది.
కన్యా రాశి: భాగస్వామ్య వ్యవహారాలు, వ్యక్తిగత సంబంధాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో పని భారం పెరగవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి. కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం ఉంటుంది.
తులా రాశి: ఈ రాశి వారికి ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో పాత కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా రావాల్సిన డబ్బు చేతికి అందవచ్చు.
వృశ్చిక రాశి: కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం ముఖ్యం. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభించే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
ధనుస్సు రాశి: విద్య, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు రావచ్చు. ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి.
మకర రాశి: గతంలో ఎదురైన వివాదాల నుంచి ఉపశమనం లభించవచ్చు. ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగుతాయి. వ్యాపారంలో పనులు వేగం పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
కుంభ రాశి: శని మార్గ సంచారం ఈ రాశి వారికి ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో చాలాకాలంగా ఎదురవుతున్న సమస్యలు తగ్గవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి.
మీన రాశి: ఈ రాశిలోనే శని మార్గ సంచారంలోకి రానుండటంతో ఈ మార్పు కీలకంగా ఉండవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో అడ్డంకులు క్రమంగా తగ్గుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం, కుటుంబ బాధ్యతల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.