Lord Shani Dev: శని దేవుడి కటాక్షం.. మరో 83 రోజుల పాటు వీరికి అదృష్టమే అదృష్టం!

శని దేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మరో 83 రోజులు కొనసాగనున్నాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూరే అవకాశముంది. మరీ ముఖ్యంగా వృషభం, తుల, మకరం, కుంభ రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

Lord Shani Dev: శని దేవుడి కటాక్షం.. మరో 83 రోజుల పాటు వీరికి అదృష్టమే అదృష్టం!
Saturn Transit In Uttara Bhadra Nakshatra

Updated on: Nov 17, 2026 | 7:40 PM

Saturn Transit in Uttara Bhadra: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శనీశ్వరుడిని కర్మ కారకుడిగా, న్యాయ ప్రదాతగా భావిస్తారు. ఒక వ్యక్తి చేసే పనులు, కష్టానికి తగిన ఫలితాలను శని అందిస్తాడని జ్యోతిష్య నమ్మకం. ప్రస్తుతం శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9న ఈ నక్షత్రంలోకి ప్రవేశించిన శని, మరో 83 రోజుల పాటు..అంటే 2027 ఫిబ్రవరి 8 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగనున్నాడు. శని తన సొంత నక్షత్రంలో సంచరించడం వల్ల నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశముంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

వృషభ రాశి

శని ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం వృషభ రాశి వారికి కెరీర్ పరంగా మంచి మార్పులను తీసుకురానుంది. చాలాకాలంగా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు చేసిన కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు పాత పరిచయాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. పెండింగ్ పనులు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

తులా రాశి

తుల రాశి వారికి రాబోయే 83 రోజులు కెరీర్ పరంగా కీలకంగా మారనున్నాయి. ఉద్యోగులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి అవకాశాలు పొందుతారు. కొంతకాలంగా నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ పొందే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం కూడా గతంలో కంటే మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

మకర రాశి

మకర రాశికి శని అధిపతి కావడంతో ఈ నక్షత్ర సంచారం ప్రత్యేక ప్రయోజనాలను అందించనుంది. చాలాకాలంగా పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇవి కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయి. వ్యాపారులకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనుభవం ఉన్న వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆర్థిక, వృత్తి జీవితాల్లో ఉపశమనం లభిస్తుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి అనుకూల ఫలితాలు దక్కనున్నాయి. ప్రస్తుతం ఈ రాశి వారికి శని సాడే సాతి చివరి దశ కొనసాగుతోంది. అయినప్పటికీ రాబోయే 83 రోజుల్లో కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు చాలాకాలంగా ఆలోచిస్తున్న ప్రణాళికలను ఆచరణలో పెట్టేందుకు అనుకూల సమయం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు గతంలో కంటే మెరుగుపడే సూచనలు ఉన్నాయి.

(గమనిక: ఇవి జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాలు, అంచనాల ఆధారంగా ఇచ్చిన వివరాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండే అవకాశముంది)

Loading...
Unable to load recommendations.
Follow Us