Money Astrology: రాహువుతో గండం.. డబ్బు, కెరీర్ విషయాల్లో ఆ రాశులు జాగ్రత్త!

కుంభ రాశిలో చివరి దశలో సంచరిస్తున్న రాహువు ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, వివాహ విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 5, 2026న రాహువు మకర రాశిలోకి మారే వరకు మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు మోసాలు, భ్రమలు, ఆర్థిక నష్టాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Money Astrology: రాహువుతో గండం.. డబ్బు, కెరీర్ విషయాల్లో ఆ రాశులు జాగ్రత్త!
Rahu Negative Impact

Edited By:

Updated on: Sep 04, 2026 | 6:23 PM

ప్రస్తుతం కుంభ రాశిలో చివరి దశలో ఉన్న రాహువు వల్ల కొన్ని రాశుల వారు మోసపోవడానికి, నష్టపోవడానికి బాగా అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 5న కుంభ రాశి నుంచి మకర రాశిలోకి మారే వరకు.. రాహువుతో వీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. వక్ర గ్రహం, పాప గ్రహం, విష నాగు, రాక్షస గ్రహం అనే పేర్లున్న రాహువు ఈ రాశుల వారికి ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఎండమావులను చూపించి భ్రమపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశులవారు డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి వంటి విషయాల్లో దెబ్బతినే అవకాశం ఉంది.

మిథునం

ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల మోసపూరిత విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాల పేరుతో, కన్సల్టెన్సీ పేరుతో వీరిని మోసగించే సూచ నలు కనిపిస్తున్నాయి.. విదేశీ ఆఫర్ల విషయంలో వీరు డిసెంబర్ 5 వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, ఆర్థిక వ్యవహారాల్లో కూడా నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రలోభాలకు, ఆశలకు, ఊరింపులకు కాస్తంత దూరంగా ఉండడం శ్రేయ స్కరం.

కర్కాటకం

అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా నష్టపర చడం లేదా మోసగించడం జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఇళ్ల స్థలాల అమ్మకాలు, గృహ నిర్మాణం, ఆర్థిక సహాయ ప్రయత్నాల్లో నష్టపోవడం, మోసపోవడం వంటివి జరుగుతాయి.. దళారీల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఒప్పందాలపై గుడ్డిగా సంతకాలు చేయడం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు.

ఇవి కూడా చదవండి

సింహం

ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువు వల్ల అనవసర పరిచయాలకు బాగా అవకాశం ఉంది. మిత్రులు శత్రువులుగా మారడం, రహస్య శత్రువులు తయారు కావడం వంటివి జరిగే సూచనలున్నాయి. అనారోగ్యాల్ని గుర్తించడంలో, సరైన వైద్యుడిని సంప్రతించడంలో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో మోసపోవడం జరుగుతుంది.. సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

వృశ్చికం

ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఆస్తి వివాదాల్లో మోసపోవడానికి, నష్టపోవడానికి బాగా అవకాశం ఉంది. ఆస్తుల క్రయవిక్రయాల్లో భారీ నష్టాలు కలుగుతాయి. ఉద్యోగాల పేరుతో, ముఖ్యంగా విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఇతరుల వాగ్దానాలు, హామీలు, ప్రలోభాలకు లొంగిపోయే అవకాశం ఉంది. స్థలం లేదా ఇల్లు కొనుగోలు పెట్టుకోవద్దు.

మకరం

ఈ రాశికి ధన స్థానంలో రాహువు సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో బాగా మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులే కాక, బంధుమిత్రులు కూడా నష్టపరిచే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము రాకపోవచ్చు. మొండి బాకీలు పెరుగుతాయి. ఆస్తి అమ్మకంలో నష్టపోవడం జరుగుతుంది. ఇతరుల్ని నమ్మి ఆర్థికంగా దెబ్బతినడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఒప్పందాల మీద సంతకాలు చేయకపోవడం, ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. డబ్బు ఇస్తే తిరిగి రాదు.

కుంభం

ఈ రాశిలో ఉన్న రాహువు వల్ల డిసెంబర్ 5 లోపల అనేక విధాలా ఆర్థికంగా, ఉద్యోగపరంగా నష్టపోయే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా మోసపోయే సూచనలున్నాయి. ఉద్యోగాలు, స్థలాలు, అధిక వడ్డీలు, పెట్టుబడుల పేరుతో మోసపోయే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో, ఒప్పందాలు కుదర్చుకోవడంలో, హామీలు ఉండడంలో ఆచితూచి అడుగువేయడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లోనే కాక, ప్రేమ వ్యవహారాల్లో కూడానమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది.

Also Read: ఈ నెలంతా వారికి లక్ష్మీ కటాక్షం..ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్..!

Loading...
Unable to load recommendations.
Follow Us