AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఆ తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్ల తర్వాత.. ఆర్థిక పురోగతి, కెరీర్‌లో విజయాలు..!

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా నిర్ణయించే మూలాంకం వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా మూలాంకం 4, 8 కలిగిన వారికి జీవితంలో ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా.. 35 ఏళ్ల తర్వాత స్థిరత్వం, ఆర్థిక పురోగతి, కెరీర్‌లో విజయాలు లభించే అవకాశాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. చిన్ననాటి కలలను కూడా ఈ వయసు తర్వాత సాకారం చేసుకునే అవకాశం ఉంటుందని నమ్మకం.

Numerology: ఆ తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్ల తర్వాత.. ఆర్థిక పురోగతి, కెరీర్‌లో విజయాలు..!
Numerology 4 And 8 Mulank
Janardhan Veluru
|

Updated on: Aug 27, 2026 | 11:55 AM

Share

సంఖ్యా శాస్త్రం (న్యూమరాలజీ) ప్రకారం వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా మూలాంకం నిర్ణయిస్తారు. ప్రతి మూలాంకానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటుందని విశ్వసిస్తారు. ఈ గ్రహ ప్రభావం వల్ల వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, జీవితం, విజయాలపై ప్రభావం ఉంటుందని చెబుతారు. ఈ క్రమంలో మూలాంకం 4, 8 కలిగిన వారికి జీవితంలో ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా.. 35 ఏళ్ల తర్వాత స్థిరత్వం, విజయాలు లభించే అవకాశాలు ఉంటాయని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

మూలాంకం 8 వారికి ఆలస్యంగా విజయం

ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8. సంఖ్యా శాస్త్రంలో ఈ సంఖ్యకు శని గ్రహాన్ని అధిపతిగా పరిగణిస్తారు. శని కర్మ, న్యాయం, క్రమశిక్షణకు ప్రతీకగా భావిస్తారు. మూలాంకం 8 ఉన్నవారు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు, ఆటంకాలు, కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చని భావిస్తారు. ఎంత కష్టపడినా వారికి ఫలితాలు కొంత ఆలస్యంగా లభించే అవకాశముంది. అయితే వీరు పట్టుదలతో లక్ష్యం వైపు ముందుకు సాగుతారని న్యూమరాలజీ నిపుణులు చెబుతారు.

35 నుంచి 36 ఏళ్ల తర్వాత మూలాంకం 8 వారికి జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవడం, కెరీర్‌లో పురోగతి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి మార్పులు వారికి అనుభవంలోకి వస్తుంది. చిన్నతనంలో కన్న కలలను కూడా 35-36 ఏళ్ల వయసు తర్వాత సాకారం చేసుకునే అవకాశం ఉంటుందని సంఖ్యా శాస్త్రం పేర్కొంటోంది.

ఇవి కూడా చదవండి

మూలాంకం 4 వారికి కూడా 35 తర్వాత స్థిరత్వం

4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 4. ఈ సంఖ్యకు రాహు అధిపతిగా సంఖ్యా శాస్త్రంలో భావిస్తారు. మూలాంకం 4 వారికి ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఆలోచించే స్వభావం ఉంటుందని చెబుతారు. కొత్త విషయాలను ప్రయత్నించడం, సృజనాత్మకంగా ఆలోచించడం వీరి ప్రత్యేకతలుగా పేర్కొంటారు. అయితే జీవిత ప్రారంభ దశలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత గందరగోళానికి గురవుతారని భావిస్తారు. అనుకోని మార్పులు, పరిస్థితులు వీరి ప్రయాణంలో ఆటంకాలను సృష్టించవచ్చని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అయితే వయసు పెరిగే కొద్దీ అనుభవం ద్వారా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు.

35 ఏళ్ల తర్వాత మూలాంకం 4 వారికి కెరీర్, ఆర్థిక జీవితంలో స్థిరత్వం పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో చిన్నతనంలో లేదా యువ వయసులో ఏర్పడిన లక్ష్యాలను తర్వాతి జీవితంలో సాధించే అవకాశం ఉంటుందని చెబుతారు.

లక్ష్యంపై దృష్టి.. విజయానికి కీలకం

మూలాంకం 4 లేదా 8 ఉన్నవారు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని నిరంతరం కృషి చేయాలని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభంలో ఎదురయ్యే సమస్యలకు కుంగిపోకుండా అనుభవం, పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని చెబుతారు.

(గమనిక: పై వివరాలు సంఖ్యా శాస్త్రంలోని నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు)

Follow Us
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..? చిట్కాలు ఇవిగో..
తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..? చిట్కాలు ఇవిగో..
బంగారం దీవి.. మాల్దీవులను మర్చిపోయేలా చేసే అద్భుతం..! ఎక్కడంటే...
బంగారం దీవి.. మాల్దీవులను మర్చిపోయేలా చేసే అద్భుతం..! ఎక్కడంటే...
తీవ్ర కుదుపుల మధ్య ల్యాండింగ్..తెరుచుకున్న లగేజ్ క్యాబిన్లు..!
తీవ్ర కుదుపుల మధ్య ల్యాండింగ్..తెరుచుకున్న లగేజ్ క్యాబిన్లు..!
హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి 'మహారాజ' రీమేక్.. హీరో ఎవరో తెలుసా?
హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి 'మహారాజ' రీమేక్.. హీరో ఎవరో తెలుసా?