
బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పరిగణిస్తారు. బుధుడు తెలివితేటలు, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్, తర్క శక్తి, ఏకాగ్రతకు కారకుడిగా చెబుతారు. అందుకే బుధుడి రాశి, నక్షత్ర సంచారాలకు జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. బుధుడి స్థానంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు వ్యక్తుల ఉద్యోగం, వ్యాపారం, విద్యతో పాటు ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడుతుందని నమ్ముతారు. ప్రస్తుతం తులా రాశిలో సంచరిస్తున్న బుధుడు.. డిసెంబర్ 2న వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం డిసెంబర్ 4న తన నక్షత్రాన్ని కూడా మార్చుకోనున్నాడు. విశాఖ నక్షత్రం నుంచి బయటకు వచ్చి శని ఆధిపత్యంలోని అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడుMercury Transit in Anuradha Nakshatra). డిసెంబర్ 13 వరకు ఇదే నక్షత్రంలో సంచరించి, ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రంలోకి మారుతాడు.
అనురాధ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. శని దేవుడిని కర్మ, క్రమశిక్షణ, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. ఈ నేపథ్యంలో శని నక్షత్రంలో బుధుడి సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశముంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి లభించే అవకాశాలున్నాయి.
వృషభ రాశి వారికి బుధుడి అనురాధ నక్షత్ర సంచారం అనుకూల ఫలితాలను ఇవ్వనుంది. ఈ రాశికి చెందిన ఏడో ఇంట్లో బుధుడి సంచారం జరగనుంది. ఫలితంగా భాగస్వామ్య వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కూడా పరిస్థితులు మెరుగుపడుతాయి. ఉద్యోగులకు కొత్త వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టులు లేదా భాగస్వామ్య వ్యాపార ప్రతిపాదనలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశాలున్నాయి.
కర్కాటక రాశి వారికి బుధుడి నక్షత్ర మార్పు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన ఐదో ఇంట్లో బుధుడి సంచారం జరగనుంది. దీంతో విద్యా రంగంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల సమయంగా ఉంటుంది. ఉద్యోగులకు సృజనాత్మకత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. కార్యాలయంలో పనితీరు మెరుగుపడటంతో పాటు మంచి గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
కన్యా రాశి వారికి బుధుడి అనురాధ నక్షత్ర ప్రవేశం అనుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశికి చెందిన మూడో ఇంట్లో బుధుడి సంచారం జరగనుంది. దీంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యసాధన సామర్థ్యం పెరిగే అవకాశాలున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే అవకాశముంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీడియా, రచనా రంగం, విద్య, మార్కెటింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. పని నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడటంతో పాటు వారితో సంతోషంగా సమయం గడుపుతారు.
మకర రాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశముంది. ఈ రాశికి చెందిన 11వ ఇంట్లో బుధుడి సంచారం జరగనుంది. జ్యోతిష్యశాస్త్రంలో 11వ ఇంటిని ఆదాయం, లాభాలకు సంబంధించిన స్థానంగా పరిగణిస్తారు. దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, వేతన పెంపు, ప్రమోషన్ వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త పరిచయాల ద్వారా లాభాలు దక్కుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు, ప్రణాళికలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు తగదు.
(గమనిక: ఈ కథనంలోని అంశాలు జ్యోతిష్య నమ్మకాలు, విశ్వాసాల మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. ఇది ఖచ్చితంగా నిజమవుతాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు)