
ప్రస్తుతం తనకు ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలో సంచరిస్తున్న గురువు.. అక్టోబర్ 31న కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి మారడం జరుగుతోంది. సింహ రాశిలో గురువు జనవరి 24 వరకూ కొనసాగుతాడు. గురువు కర్కాటక రాశిలో ఉన్నంత కాలం గురువు దృష్టి మీన రాశిలో ఉన్న శని మీద పడడం వల్ల కొన్ని రాశుల వారికి శని దోషం నుంచి చాలా వరకు ఉపశమనం లభించింది. రాశి మారిన తర్వాత గురు దృష్టికి అవకాశం లేనందువల్ల శనీశ్వరుడు మళ్లీ పూర్తి స్థాయిలో దోషం కలిగించే అవకాశం ఉంది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులవారు అక్టోబర్ 31 లోగా తమ వ్యవహారాలను చక్కబెట్టుకుని, శని దాడికి సిద్ధంగా ఉండడం మంచిది. శనికి దీపం వెలిగించడం మంచిది.
ఈ రాశికి వ్యయ స్థానంలో శనీశ్వరుడు సంచారం వల్ల కలిగిన ఏలిన్నాటి శని దోషం గురువు దృష్టి వల్ల కొద్దిగా తగ్గింది. అది మళ్లీ పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీని వల్ల ఖర్చులు పెరగడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, ఆలస్యాలు జరగడం జరుగుతాయి. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం, దూర ప్రాంతానికి బదిలీ కావడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు. పదోన్నతి, జీతాల పెరుగుదలకు అవకాశం ఉండదు.
ఈ రాశికి శని మీద గురువు దృష్టి తొలగిపోవడం వల్ల అష్టమ శని దోషం మళ్లీ విజృంభించే అవ కాశం ఉంది. దీనివల్ల ఆదాయంలో వృద్ధి ఉండదు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో నష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందగి స్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ, తిప్పట పెరుగుతాయి.
ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శనిని లాభ స్థానం నుంచి వీక్షిస్తున్న గురువు నెల రోజుల తర్వాత రాశి మారుతున్నందువల్ల పెళ్లి సంబంధాలు తప్పిపోవడం ఎక్కువగా జరుగుతుంది. సాయం పొందినవారు ముఖం చాటేస్తారు. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో వివాదాలు, విభేదాలు తలెత్తుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు కలుగు తాయి.. ఉద్యోగంలో అధిక శ్రమ, ఒత్తిడి ఉంటుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది.
ఈ రాశివారికి చతుర్థ స్థానంలో శని ప్రవేశం వల్ల అర్ధాష్టమ శని దోషం కలుగుతోంది. గురు దృష్టి నుంచి శని బయటపడడం వల్ల శని విజృంభించే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తులాయి. కుటుంబంలో సుఖ శాంతులు లోపిస్తాయి. గృహ, వాహన ప్రయత్నా లకు ఆటంకాలు ఏర్పడతాయి. తల్లి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గు తుంది. ఆదాయ ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.
ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం కలిగింది. గురు దృష్టి వల్ల కలిగిన కొద్ది పాటి ఉపశమనం కూడా అక్టోబర్ 31 తర్వాత ముగుస్తుంది. ఆర్థిక సమస్యలు కలుగుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆదాయం బాగా తగ్గిపోతుంది. డబ్బు తీసుకున్నా, ఇచ్చినా ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. శుభ కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి తగ్గుతుంది.
ఈ రాశిలో ప్రవేశించిన శని వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండి ఈ శనిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి కొద్దిగా ఉపశమనం లభించింది. అది అక్టోబర్ 31 తర్వాత ఉండకపోవచ్చు.. దీనివల్ల అనారోగ్యాలు పీడిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి మందగిస్తుంది. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. విజయాలు, సాఫల్యాలు బాగా తగ్గిపోతాయి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య సమాచారం, రాశిఫలాలు, గ్రహాల సంచార ఫలితాలు సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాలు, అంచనాల ఆధారంగా అందించబడుతున్నాయి. వీటికి శాస్త్రీయ ఆధారం లేదని గమనించాలి.