AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spiritual Meaning: కలల్లో బొద్దింకలు కనిపిస్తున్నాయా?.. మీ జీవితంలో జరగబోయే ఆ మార్పుకు ఇది పెద్ద సంకేతం!

మనం నిద్రపోతున్నప్పుడు వచ్చే కొన్ని రకాల కలలు మనకు భయాన్ని కలిగిస్తే, మరికొన్ని కలలు వింతగా అనిపిస్తాయి. సాధారణంగా ఇంట్లో బొద్దింకలు కనిపిస్తేనే చాలా మంది అసహ్యించుకుంటారు లేదా భయపడి దూరంగా పరుగెడుతుంటారు. అలాంటిది రాత్రి పడుకున్నప్పుడు కలలో బొద్దింకలు కనిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే, స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కలకూ ఒక ప్రత్యేకమైన అర్థం, మన భవిష్యత్తుతో ఒక బలమైన లింక్ ఉంటుంది.

Spiritual Meaning: కలల్లో బొద్దింకలు కనిపిస్తున్నాయా?.. మీ జీవితంలో జరగబోయే ఆ మార్పుకు ఇది పెద్ద సంకేతం!
Swapna Shastra Secret Meaning
Bhavani
|

Updated on: May 28, 2026 | 5:08 PM

Share

స్వప్న శాస్త్ర విశ్లేషణల ప్రకారం.. కలలో బొద్దింకలు కనిపించే విధానాన్ని బట్టి (అవి బతికి ఉన్నాయా, చనిపోయాయా లేదా సంఖ్య ఎంత అనే దానిపై) శుభ అశుభ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కలలో బొద్దింకలు కనిపించడం కేవలం ఒక యాదృచ్ఛిక విషయం కాదు.. అది మీ జీవితంలో రాబోయే కొన్ని మంచి లేదా చెడు మార్పులను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి కలలో బొద్దింక వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

1. కలలో సాధారణంగా బొద్దింక కనిపిస్తే మీ కలలో ఒక బొద్దింక అటూ ఇటూ తిరుగుతున్నట్లు కనిపిస్తే, అది మీ అంతరంగంలో ఉన్న భయాలు లేదా ఒత్తిడిని సూచిస్తుంది. రాబోయే రోజుల్లో మీరు కొన్ని రకాల మానసిక ఆందోళనలకు గురవుతారని, లేదా మీ పనులలో చిన్నపాటి అడ్డంకులు ఎదురవుతాయని దీని అర్థం. ఇలాంటి కల వస్తే మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.

2. బొద్దింకను చంపినట్లు కల వస్తే ఒకవేళ మీరు కలలో ఒక బొద్దింకను చంపినట్లు లేదా అది చనిపోయి ఉన్నట్లు కనిపిస్తే, స్వప్న శాస్త్రం ప్రకారం ఇది చాలా మంచి సంకేతం. మీ జీవితంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు లేదా కష్టాల నుండి మీకు త్వరలోనే విముక్తి లభిస్తుందని దీని అర్థం. శత్రువులపై విజయం సాధించడానికి మరియు మీ ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇది సూచనగా భావిస్తారు.

3. బెడ్‌రూమ్‌లో లేదా ఒంటిపై బొద్దింక వాలినట్లు వస్తే: మీరు పడుకునే మంచంపై లేదా మీ శరీరంపై బొద్దింకలు పాకుతున్నట్లు కల వస్తే.. అది మీ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. రాబోయే రోజుల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే ముప్పును కూడా ఇది సూచిస్తుంది.

4. ఇంట్లోకి విపరీతంగా బొద్దింకలు రావడం: మీ ఇల్లంతా బొద్దింకలతో నిండిపోయినట్లు కల వస్తే.. మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతోందని అర్థం. ఇది మీ ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. ఇలాంటి కలలు పదే పదే వస్తుంటే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేయాలని స్వప్న శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

5. ఆధ్యాత్మిక లేదా మానసిక కోణం: ఆధునిక మనస్తత్వ శాస్త్రం ప్రకారం, కలలో బొద్దింకలు రావడం అనేది మన మైండ్‌లో పేరుకుపోయిన అనవసరమైన ఆలోచనలు, చెడు అలవాట్లను లేదా మనకు నచ్చని పనులను సూచిస్తుంది. మన జీవితాన్ని మనం రీ-ఆర్గనైజ్ (సరిచేసుకోవడం) చేసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పడానికి ఇది ఒక సింబాలిక్ గుర్తు.

గమనిక : ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు సాధారణ స్వప్న శాస్త్ర నమ్మకాలు, జ్యోతిష్య నిపుణుల విశ్లేషణలు మరియు ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. వ్యక్తిగత నమ్మకాలు, గ్రహస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు.

Follow Us