Horoscope Today: వారికి ఆర్థికంగా కలలో కూడా ఊహించని అదృష్టం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (September 13, 2025): మేష రాశి వారు ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మిథున రాశి వారు జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి ఆర్థికంగా కలలో కూడా ఊహించని అదృష్టం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 13 September 2025

Edited By:

Updated on: Sep 13, 2025 | 5:31 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 13, 2025): మేష రాశి వారు ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులను బాగా ఆకట్టుకునే అవకాశముంది. వృషభ రాశి వారు ఒకటి రెండు శుభవార్తలు అందుకునే అవకాశముంది. మిథున రాశి వారు జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆదాయ, ఆరోగ్య ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసుకోవడం మంచిది. పెద్దల సాయంతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసివస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి, ప్రేమ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పిల్లలు కొద్ది శ్రమతో చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థికంగా కలలో కూడా ఊహించని అదృష్టం పడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. పదోన్నతుల విషయంలో ఆశించిన శుభ వార్తలు వింటారు. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కార మవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృథా ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశాభంగం తప్పకపోవచ్చు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. సమర్థతకు ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యు లేషన్ వంటివి లాభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. అధికారులకు మీ పని తీరు బాగా నచ్చుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనుకోకుండా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కొందరు బంధు మిత్రులు ఎక్కువగా ఆధార పడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పొందే అవకాశం ఉంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. తల్లి తండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని శుభ వార్తలు అందుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. తలపెట్టిన వ్యవహారాలన్నీ కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గట్టి పట్టుదలతో వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us