
Rasi Phalalu: మేషం రాశి వారికి విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభం రాశివారికి ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. ఇంటి పనులు, బయట పనుల్లో మీ ప్లాన్లు విజయవంతమవుతాయి. మిథునం రాశి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. అనుకోకుండా కొందరు ప్రము ఖులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వా మితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమ స్యల ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. ఇంటి పనులు, బయట పనుల్లో మీ ప్లాన్లు విజయవంతమవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.
నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఒకరిద్దరు బంధువుల్ని ఆర్థికంగా ఆదుకుంటారు. గృహ నిర్మాణ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆరోగ్యం పరవాలేదు.
ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి.
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు బాగా విస్తరిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమపడడం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో కొన్ని స్థిర మైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.
ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా సత్ఫలితాలనిస్తాయి. తోబుట్టువులకు అండగా నిలబడతారు. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగాగా సాగిపోతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి.
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఖర్చులు పెరిగినప్పటికీ ఇబ్బంది ఉండదు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు.
ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేసి లబ్ధి పొందుతారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పిల్లలు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ఉద్యోగంలో పనితీరుకు, సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగ స్వామి సలహాలు తీసుకోవడం ఉత్తమం. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగ జీవితంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం సామరస్యంగా, అన్యోన్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.