
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరులతో, కొందరు బంధు వులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి తగ్గడానికి వీలుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగాఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగానే రాబడి పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలున్నా ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయా నికి ఇబ్బందేమీ ఉండదు. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. సోదర వర్గంతో ఆస్తి వివా దంలో రాజీమార్గం అనుసరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజ నకంగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఓ వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆదాయ పరంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవ కాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త బాధ్యతలు, లక్ష్యాలను చేపడతారు. కొందరు బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. సమా జంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందు తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కు వగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొనడం, ఆలయాలు సందర్శించడం జరుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలువింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులు అప్పగించిన లక్ష్యాలు, బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు చాలావరకు పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయ త్నాలు సఫలమవుతాయి. పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక పురో గతికి బాగా అనుకూలంగా ఉంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. సామా జికంగా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. జీవిత భాగస్వామి ఏ రంగంలో ఉన్నప్పటికీ, ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరి ష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. కొందరు బంధువులకు, సన్నిహితు లకు ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తోబుట్టువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడంమంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యో గులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు సహాయపడతారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి పోతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవు తాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో, దైవ కార్యాల్లో గడుపు తారు.