AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రోజు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా..

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రోజు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
Subhash Goud
|

Updated on: Oct 23, 2021 | 6:26 AM

Share

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 23న ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషరాశి:

ప్రారంభించే పనులలో ఆలస్య కానివ్వకుండా చూసుకోండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి చనువుగా ఉండటం మంచిది కాదు. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి.

వృషభ రాశి:

కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి:

శ్రమకు మించిన ఫలితం ఉంటుంది. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేస్ఆతరు. చేపట్టే పనులలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కర్కాక రాశి:

ముఖ్యమైన విషయాలలో సంబంధిత పెద్దలను కలుసుకుంటారు. తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగానే ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టే పనులలో విజయం సాధిస్తారు.

సింహ రాశి:

ఓ శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు.

కన్య రాశి:

ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. వ్యాపారాలలో మంచి లాభాలు అందుకుంటారు.

తుల రాశి:

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టే పనులలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అకస్మిక ప్రయాణాలు చేస్తారు.

వృశ్చిక రాశి:

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు ఉండే అవకాశం.

ధనుస్సు రాశి:

మీమీ రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు ఉత్సాహ పరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టే పనులు అనుకూలంగా ఉంటాయి.

మకర రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రయాణాలు తప్పవు. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆలసట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి.

కుంభ రాశి:

పెట్టిన పెట్టుబడులలో మంచి ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీన రాశి:

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!