Telugu News Astrology Guru Chandra Connection: These 6 Zodiac Signs May Get Unexpected Luck From August 17 to 27
Lucky Days: గురు చంద్రుల అనుబంధం..త్వరలో ఆ రాశుల వారికి లక్కీ డేస్..!
ఆగస్టు 17 నుంచి 27 వరకు గురు, చంద్ర గ్రహాల మధ్య ఏర్పడే ప్రత్యేక అనుబంధం వల్ల గజకేసరి యోగంతో పాటు పలు శుభ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఈ ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి అదృష్టం పట్టనుంది. అలాగే ఈ రాశులకు ఆర్థిక లాభాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.
గురు, శిష్యులైన గురు, చంద్రుల మధ్య ఏ విధమైన కనెక్షన్ ఏర్పడినా అది తప్పకుండా కొన్ని రాశులకు అదృష్టాలను తీసుకువస్తుంది. ఈ రెండు గ్రహాల మధ్య అనుబంధం ఏర్పడడమనేది జ్యోతిష శాస్త్రంలో ఒక గొప్ప యోగం కింద పరిగణన పొందింది. ఈ నెల(ఆగస్టు) 17 నుంచి 27 వరకు ఈ రెండు గ్రహాల మధ్య అటువంటి అనుబంధం ఏర్పడినందువల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆగస్టు 17న తులా రాశిలో గజకేసరి యోగం, వృశ్చిక రాశిలో చంద్రుడి మీద గురు దృష్టి, ధనూ రాశిలో గురు, చంద్రుల పరివర్తన, మకర రాశిలో గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి.
మేషం: ఈ రాశివారికి ఈ పది రోజుల చంద్ర సంచారం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉండబోతోంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సత్ఫలితాలనిస్తుంది. ఆత్మవిశ్వాసం, మానసిక స్థయిర్యం వృద్ది చెందుతాయి. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం లభి స్తుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. తల్లి నుంచి ఆస్తి గానీ, సంపద గానీ లభిస్తుంది. పిల్లలు చదువుల్లో బాగా పైకి వస్తారు. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి.
మిథునం: ఐశ్వర్య కారకుడు, ధన స్థానాధిపతి అయిన చంద్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల అనేక మార్గా లలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రము ఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కార మవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపట్టడానికి, వృత్తి, వ్యాపారాల్లో కొత్త పుంతలు తొక్కించడానికి ఇది బాగా అనుకూల సమయం.
కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడికి ఉచ్ఛ స్థితిలో ఉన్న భాగ్యాధిపతి గురువుకు అనుబంధం ఏర్పడడం వల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తడుతుంది. ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయట పడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.
తుల: దశమాధిపతి చంద్రుడికి ధన కారకుడైన గురువుతో సంబంధం ఏర్పడడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యో గులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు పెరిగే పనులు చేస్తారు. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.
వృశ్చికం: భాగ్యాధిపతి చంద్రుడికి, ధనాధిపతి గురువుకు మధ్య కనెక్షన్ ఏర్పడడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు పెరగడం, అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు చేస్తారు. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విశేషంగా ఫలిస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
మకరం: సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు, సప్తమాధిపతి చంద్రుడికి యోగదాయక సంబంధం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా పురోగతి చెందడంతో పాటు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి నిశ్చయం కావడం గానీ జరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
(గమనిక: ఈ కథనం జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాలు నమ్మకాలు, గ్రహాల స్థితిగతులు, రాశి ఫలితాల ఆధారంగా రూపొందించబడింది. ఇందులోని ఫలితాలు వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు, దశలు తదితర అంశాల ఆధారంగా మారవచ్చు. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా కాకుండా విశ్వాసం, సంప్రదాయాల కోణంలో మాత్రమే పరిగణించాలి)