సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే.. మరీ మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

Horoscope Today (September 7, 2026): సోమవారం మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేష రాశి వారికి ఉద్యోగ, వృత్తి జీవితం అనుకూలంగా ఉండటంతో పాటు వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి వ్యాపార లాభాలు నిలకడగా సాగుతాయి, నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. మిగిలిన రాశుల వారి ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే.. మరీ మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Horoscope September 7

Edited By:

Updated on: Sep 07, 2026 | 6:37 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 6, 2026): నేటి రాశిఫలాల ప్రకారం మేషం నుంచి మీనం వరకు రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కొన్ని రాశులకు ఆదాయం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండగా, మరికొన్ని రాశులు ఆరోగ్యం, ఆస్తి వ్యవహారాలు, కుటుంబ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి. దాంపత్యం, ప్రయాణాలు, వ్యక్తిగత సమస్యల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి సంబంధమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. శత్రు వులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడతారు. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని కూడా సంప్రదించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉత్సాహంగా బాధ్యతల్ని, లక్ష్యాల్ని పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొం టారు. కొందరు సన్నిహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తోబుట్టువులతో వివాదాలను పరిష్కరించు కుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. దూర ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో కొన్ని ప్రధానమైన అడ్డంకులను తొలగించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగా ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి కొత్త అవకాశాలు అందివస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. కొన్ని కొత్త ప్రయత్నాలను చేపడతారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్క బెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టు దలగా కొనసాగిస్తారు. ప్రయాణాలలో, ఆహార నియమాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండవచ్చు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మిత్రులతో వాదోప వాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అధికారులు అలవికాని లక్ష్యాల్ని అప్పగించే సూచనలున్నాయి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికిపూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగంలో ఉన్నవారికి రాబడి పెరు గుతుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి వృద్ధి చెందుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయ లుగా ‍సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి, ఆర్థికంగా లబ్ధి పొందుతారు. కష్టార్జితానికి లోటుండదు కానీ, మిత్రుల కోసం వృథా ఖర్చు చేయడం జరుగు తుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో చాలావరకు సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సా హంగా సాగుతాయి. బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతుంది. శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నా, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందు తుంది. దీర్ఘకాలిక అనారోగ్య, ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల పరిస్థితి నిల కడగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమ స్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివా దాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయానికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వీలైనంత సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us