అక్టోబర్ 22 రాశిఫలాలు: వీరికి ఉద్యోగంలో మంచిరోజులు.. ఆదాయం పెరిగే ఛాన్స్

Horoscope Today (October 22, 2026): గురువారం 12 రాశుల వారి జాతకం ఎలా ఉంది? మేష రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయా? వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఎలాంటి గుర్తింపు లభిస్తుంది? మిథున రాశి వారికి ధనలాభం ఉందా? మిగతా రాశుల వారికి గ్రహాల అనుకూలత ఎలా ఉండబోతోంది? పూర్తి రాశిఫలాలను తెలుసుకోండి.

అక్టోబర్ 22 రాశిఫలాలు: వీరికి ఉద్యోగంలో మంచిరోజులు.. ఆదాయం పెరిగే ఛాన్స్
Today Horoscope 22 October 2026

Edited By:

Updated on: Oct 22, 2026 | 6:00 AM

దిన ఫలాలు (అక్టోబర్ 22, 2026): మేష రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ రోజంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. మిథున రాశికి చెందిన దాదాపు అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. తప్పకుండా ఆశించిన ధన లాభం పొందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో పురోగతి సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ఆస్తిపరంగా లాభం పొందడం జరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి లోటుండదు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

దాదాపు అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. తప్పకుండా ఆశించిన ధన లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదానికి సంబంధించి సోదరులతో రాజీమార్గం అనుసరిస్తారు. సమాజంలో మీకు విలువ మరింత పెరుగుతుంది. ప్రయాణాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం చాలా మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. చేపట్టిన పనుల్ని పట్టుదలతో పూర్తి చేస్తారు. కొత్త గృహ నిర్మాణ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నందువల్ల ఇతరులకు వీలైనంత ఆర్థిక సహాయం చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు తలెత్తుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూ లంగా కొనసాగుతాయి. రుణ ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడతారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఉద్యో గంలో అధికారులకు మీ సలహాలు, సూచనలు లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగు తుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కివస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం చాలావరకు సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. స్వల్ప అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలను చక్కబెడతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురో గతి సాధిస్తారు. చేపట్టిన పనుల్లో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల గురించి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థికపరంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారా లతో బాధ్యతల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయట పడతారు. కుటుంబ జీవితం అన్ని విధాలా సానుకూలంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, పెట్టుబడులకు తగ్గ లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్త అందుతుంది. దైవ చింతన పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం, సఖ్యత పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో మీ సమర్థతను, ప్రతిభను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. సోదరులతో ఆస్తి వ్యవహారంలో ఊహించని విభేదాలు తలెత్తుతాయి. విదేశీ ప్రయాణానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. కుటుంబ సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఇంటి కోసం విలువైన వస్తుసామగ్రి కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us