
జూలై 10, 11, 12 తేదీల్లో మూడు రోజుల పాటు వృషభ రాశిలో కుజ, చంద్ర గ్రహాల యుతి జరుగుతోంది. చంద్రుడికి వృషభ రాశి ఉచ్ఛస్థానం. అందువల్ల ఈ కుజ, చంద్ర గ్రహాల యుతి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.. ధన ధాన్య సమృద్ధి యోగంగా, అపర కుబేర యోగంగా పేరున్న ఈ చంద్ర, మంగళ యోగం వల్ల ఈ మూడు రోజుల కాలంలో ఆదాయ వృద్ధికి, ఆస్తి వివాదాల పరిష్కారానికి, ఆస్తులను కొనడానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా తప్పకుండా విజయవంతం లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ యోగం మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం రాశుల వారికి పట్టబోతోంది.
ఈ రాశికి ధన స్థానంలో చంద్ర మంగళ యోగం పట్టడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందే అవకాశం ఉంది. భూ లాభం కలుగుతుంది. గృహ, వాహన ప్రయ త్నాలు సఫలమవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.
ఈ రాశిలో చంద్ర, కుజులు కలిసి ధన ధాన్య సమృద్ధి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఆదాయ వృద్ధి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కలతప్పకుండా నెరవేరుతుంది. మదుపులు, పెట్టుబడుల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి.
రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం ఒక విశేషం కాగా, కుజుడితో కలిసి అపర కుబేర యోగం కలిగించడం మరో విశేషం. అనేక విధాలుగా అపారమైన ధన లాభం కలు గుతుంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారమవుతాయి.. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి.
ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదురుతుంది.. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యో గాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.
ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ, చంద్రుల యుతి జరగడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ నూరు శాతం విజయవంతం అవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులే షన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆస్తి వివాదాలు అనుకూ లంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి. భూలాభం కలుగుతుంది.
ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, చంద్రుల కలయిక జరగడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ధన యోగాలు పడతాయి. కుబేర యోగం కలుగుతోంది. ఆదాయ వృద్ధికి ఇప్పుడు చేపట్టే ప్రయ త్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. సొంత ఇంటి ప్రయ త్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగు లకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది.