నయీం కేసులో మరో సంచలనం

గ్యాంగ్ స్టర్ నయీం కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్‌లో నయీం హతమై చాలా కాలమవుతున్నప్పటికీ… ఎప్పటికప్పుడు ఈ కేసులో ఏదో ఒక కొత్త ట్విస్ట్ తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా నయీం కేసును లోక్‌పాల్‌ చట్టం కింద విచారించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ రాసింది.  నయీం కేసులో నాలుగు రాష్ట్రాల పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నందున లోక్‌పాల్ కింద విచారించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖలో […]

  • Sanjay Kasula
  • Publish Date - 11:27 am, Tue, 23 June 20
నయీం కేసులో మరో సంచలనం

గ్యాంగ్ స్టర్ నయీం కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్‌లో నయీం హతమై చాలా కాలమవుతున్నప్పటికీ… ఎప్పటికప్పుడు ఈ కేసులో ఏదో ఒక కొత్త ట్విస్ట్ తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా నయీం కేసును లోక్‌పాల్‌ చట్టం కింద విచారించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ రాసింది.  నయీం కేసులో నాలుగు రాష్ట్రాల పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నందున లోక్‌పాల్ కింద విచారించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖలో కోరింది.

నయీం కేసులో ఇప్పటికీ తేలని అంశాలు చాలానే ఉన్నాయని లేఖలో పేర్కొంది. ఇందులో డైరీ, భూములులతోపాటు డబ్బులకు సంబంధించిన డంప్ ఎక్కడ ఉందనేదే అంశాలను తేల్చాని కోరింది. అయితే 2016 ఆగష్టు‌లో నయీం ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ తర్వాత నయీం బాధితులకు న్యాయం జరగాలంటే సీబీఐతోకాని విజిలెన్స్‌ కమిషన్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ కొనసాగింది. అయితే ఇప్పటి వరకు నయీం బాధితులకు సంబంధించి 250 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో.. 107 ఛార్జ్‌షీట్లు దాఖలు కాగా.. వాటిలో 29 కేసులు పెండింగ్‌లోఉన్నాయి.

ఇదిలావుంటే.. నయీం అనుచరుల నుంచి లభించిన రూ.2.16 కోట్లును పోలీసులు  సీజ్ చేశారు. వీటితోపాటు 2 కిలోల బంగారం, 2 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 1050 ఎకరాల భూములున్నట్టు పోలీసులు తేల్చారు.  ఇక తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గోవాతో నయీంకున్న లింకులపై విచారణ జరిపితే.. అన్ని విషయాలు వెలుగులకి వస్తాయని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ లేఖలో కోరింది. నయీంతో 25 మంది పోలీస్‌ అధికారుల సంబంధం ఉన్నట్లుగా సిట్  అధికారులు ఇప్పటికే తేల్చారు. వీరితోపాటు చాలా మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్లుగా తేల్చింది. దీంతో నయీం కేసులో పలువురి జాతకాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.