Vijayasai Reddy on Special Status: ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యంధ్ర కు ప్రత్యేక ఇస్తామని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది., అనంతరం కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తాము ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని.. దానికి బదులు అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పింది. దీనికి ఏపీలో అధికారంలో ఉన్న అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు.. కానీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతుందని వైసీపీ నేతలు చెప్పారు.. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో వైసీపీ పోరాడుతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం సవరణలు ప్రతిపాదిస్తామన్నారు.
మరోవైపు పోలవరం అంచనాలపై ఆమోదానికి కూడా సవరణలు ప్రతిపాదిస్తామని విజయసాయి రెడ్డి చెప్పారు. గతంలో ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారని, దీనిపై చర్చ జరిగిన తర్వాత, ఆర్థిక బిల్లుగా పరిగణించి బీజేపీ పక్కకు తప్పించిందని అన్నారు. దీంతో లోక్‌సభలో వైసీపీ మరో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కరోనా దృష్ట్యా అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉండాలని, అవసరమైతే ఎక్కువ అప్పులు తెచ్చి ద్రవ్య చెలామణి పెంచాలని చెప్పారు విజయసాయి రెడ్డి.
Also Read: తన 53వ ఏట బాడీగార్డ్ ను ఆరో పెళ్లి చేసుకున్న హాలీవుడ్ నటి పమేలా