ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ నేతల విమర్శలు తగ్గడం లేదు. తాజాగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అనర్హుడని అన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబుకు ఏజెంట్‌గా కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో కరోనా కారణంగా ఎన్నికల ఆపిన ఆయనే ఇప్పుడు కరోనా తోలగిపోకముందే నిమ్మగడ్డ ఎందుకంత తొందరపడుతున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుతో లాలూచీ పడి ఇలాంటి పనులకు పాల్పడడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీని రద్దు చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
శరీరం మాత్రమే నిమ్మగడ్డదని, చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డను ఆవహించాడని విజయసాయి కామెంట్ చేశారు. చంద్రముఖి సోకి నిమ్మగడ్డ ఓ రాజకీయనేతలా మారిపోయాడని అన్నారు. అలాంటి వ్యక్తిని ఎస్ఈసీ పదవిలో కూర్చునే అర్హత లేదన్నారు.
నిమ్మగడ్డ మాటలు వింటుంటే ప్రవచనాలు చెప్పడంలో చాగంటి, గరికపాటి వారిని కూడా మించిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయని వ్యంగ్యంగా అన్నారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసే నిమ్మగడ్డ ఎస్ఈసీ ఉద్యోగానికే పనికిరారు. కనీసం పనిచేసేవాళ్లనైనా పనిచేయనివ్వండి అని హితవు పలికారు.
ఏపీ పంచాయతీ పోరుః సంచలనంగా మారిన ఎస్ఈసీ లేఖ.. ఆ ఫోటో ఉండే పత్రాలు చెల్లవు..!