viral video: శివంగిలా మారిన మహిళ.. యువకుడిని కిందపడేసి మరీ చితకబాదేసింది.. ఎందుకో తెలుసా..

ఆడవాళ్లకు కోపం వస్తే సివంగులుగా మారుతారు. ఎదుట ఉన్నవాడు ఎంతటివాడైనా చితకబాదేస్తారు. ఇలాంటి వీడియోలు మనం నిత్యం..

viral video: శివంగిలా మారిన మహిళ.. యువకుడిని కిందపడేసి మరీ చితకబాదేసింది.. ఎందుకో తెలుసా..

Updated on: Aug 13, 2021 | 5:13 PM

viral video : ఆడవాళ్లకు కోపం వస్తే శివంగులుగా మారుతారు. ఎదుట ఉన్నవాడు ఎంతటివాడైనా చితకబాదేస్తారు. ఇలాంటి వీడియోలు మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.. ఊర్లల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏమైందో ఏమోకానీ ఓ యువకుడిని మహిళ చితకబాదేసింది. కిందపడేసి మరి కొట్టింది. మహిళ దాడి చేస్తుండగా అక్కడ ఉన్నవారు వీడియో తీశారు. షాప్ యజమాని అయిన ఆ మహిళతో అక్కడికి వచ్చిన యువకుడు అసభ్యకరంగా మాట్లాడటంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ యువకుడిని చితక బాదిందని తెలుస్తోంది. మహిళ ఒక్కసారిగా అతడి పైకి విరుచుకుపడింది. దాంతో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకొని వారిని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళ  దాడిలో ఆయువకుడికి స్వల్ప గాయాలు అయ్యాయి.

ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. క్రాంతి నగర్ లో ఓ దుకాణంలో ఉన్న మహిళతో రామకృష్ణ అనే యువకుడు గొడవకు దిగాడు. ఆ గొడవ కాస్తా ముదరడంతో ఒకరి పై ఒకరు దాడికి దిగారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ దాడి పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..