AP News: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్ పంక్చర్ అయి ఆర్టీసీ బస్సు బోల్తా..

|

May 10, 2022 | 10:03 AM

నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు టైర్‌ పంక్చర్‌ అయింది. దీంతో బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

AP News: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్ పంక్చర్ అయి ఆర్టీసీ బస్సు బోల్తా..
Accident
Follow us on

Nellore road accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడి ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన నెల్లూరు మనుబోలు బద్వేల్ క్రాస్ రోడ్డు సమీపంలో కోల్‌కత-చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుకు టైర్‌ పంక్చర్‌ అయింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో కరీమా అనే వృద్ధురాలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు, గూడూరులోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందుతుందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Vijayawada: హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. వాష్ రూంలో బంగారం గుర్తింపు

Andhra Pradesh: కావ్య హత్య కేసులో ముమ్మర దర్యాప్తు.. గన్ ఎలా వచ్చిందనే విషయంపై అనుమానాలు