ఖానాపూర్ అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి

| Edited By:

Apr 26, 2020 | 8:19 PM

నిర్మల్ జిల్లాలోని సోమార్పేట్ బీట్‌లో విధి నిర్వహణలో ఉన్న అటవి అధికారులపై స్మగ్లర్లు దాడి చేశారు. ఈ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నారంటూ నిలదీసినందుకు ఎఫ్ఆర్ఓ, ఖానాపూర్ అటవి సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్ళతో దాడి చేశారు. అంతేకాకుండా.. చొక్కా పట్టుకుని కొట్టే ప్రయత్నం చేశారు. అయితే వారి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఎఫ్ఆర్ఓ, సిబ్బంది. అనంతరం మరికొంత సిబ్బందితో వెళ్లి ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది. అదుపులోకి తీసుకునే సమయంలో ఇరు వర్గాల మధ్య […]

ఖానాపూర్ అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి
Follow us on

నిర్మల్ జిల్లాలోని సోమార్పేట్ బీట్‌లో విధి నిర్వహణలో ఉన్న అటవి అధికారులపై స్మగ్లర్లు దాడి చేశారు. ఈ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నారంటూ నిలదీసినందుకు ఎఫ్ఆర్ఓ, ఖానాపూర్ అటవి సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్ళతో దాడి చేశారు. అంతేకాకుండా.. చొక్కా పట్టుకుని కొట్టే ప్రయత్నం చేశారు. అయితే వారి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఎఫ్ఆర్ఓ, సిబ్బంది. అనంతరం మరికొంత సిబ్బందితో వెళ్లి ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది. అదుపులోకి తీసుకునే సమయంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఎఫ్‌ఆర్‌ఓ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మరో ముగ్గురు అక్రమ కలప కూలీలు పరారయ్యారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఖానాపూర్ ఎఫ్‌ఆర్ఓ.

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు

లాక్‌డౌన్ ఇప్పుడే కాదు.. నిజాం కాలంలోనూ ఉంది! అప్పుడేం చేసేవారంటే?