కాళేశ్వరం ఫ్రాజెక్టు ఫలితాలు ఇవిగో.. “కేటీఆర్ ట్వీట్”

తెలంగాణలో మత్స్యకారులు చేపలు పట్టుకొని ఎంతగా ఉప్పొంగిపోతున్నారో అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రధాన ప్రయోజనాల్లో మత్స్య సంపద అభివృద్ధి కూడా ఒకటి అని అందులో రాసుకొచ్చారు.

కాళేశ్వరం ఫ్రాజెక్టు ఫలితాలు ఇవిగో.. కేటీఆర్ ట్వీట్
Follow us

|

Updated on: Jun 09, 2020 | 7:16 PM

KTR TWEET : తెలంగాణ చెరువుల్లో మీనం మెరిసింది. మత్స్యకారుల ఇంటా సిరులొలికించింది. జలాశయాల్లో ఎగిరిదుంకుతూ.. సందడి చేస్తూ.. బంగారు వర్ణమై మెరుస్తున్నది. జిమ్మనే నమ్ముకున్న జాలర్లకు జవసత్వాలను తెచ్చింది. సీఎం కేసీఆర్‌ స్వప్నాన్ని నిజం చేస్తూ మత్స్య సంపద..‘పసిడి’రాశులును కురిపించింది. జలపుష్పాలు..నీలివిప్లవాన్ని సృష్టించి తెలంగాణను అభిషేకించింది. “కాళేశ్వరం ప్రాజెక్టు” పుణ్యమా అని.. మండు వేసవిలోనూ జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.

తెలంగాణలో మత్స్యకారులు చేపలు పట్టుకొని ఎంతగా ఉప్పొంగిపోతున్నారో అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రధాన ప్రయోజనాల్లో మత్స్య సంపద అభివృద్ధి కూడా ఒకటి అని అందులో రాసుకొచ్చారు. మత్స్యరంగంలో సృష్టిస్తున్న పెద్ద విజృంభణగా అభివర్ణించారు ఆయన. ఈ ఏడాది తెలంగాణ మత్స్యశాఖ 3.2 లక్షల టన్నుల మంచినీటి చేపలను ఉత్పత్తి చేసిందని అలాగే.. 15 వేల టన్నుల మంచినీటి రొయ్యలను ఉత్పత్తి జరుగుతున్నదని హర్షం వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల్లో మత్స్యకారులు చేపలు పట్టుకొని సంతోషం వ్యక్తం చేస్తున్న ఫొటోలను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.