అంతర్వేది ఆలయ ఈవోగా ఎర్రంశెట్టి భద్రాజి బాధ్యతలు

| Edited By:

Sep 09, 2020 | 2:18 PM

అంతర్వేది ఆలయ కొత్త ఈవోగా ఎర్రంశెట్టి భద్రాజి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభ, మంత్రోచ్ఛరణలతో ఆలయ

అంతర్వేది ఆలయ ఈవోగా ఎర్రంశెట్టి భద్రాజి బాధ్యతలు
Follow us on

Antarvedi temple news: అంతర్వేది ఆలయ కొత్త ఈవోగా ఎర్రంశెట్టి భద్రాజి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభ, మంత్రోచ్ఛరణలతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కాగా అంతర్వేది రథం ఘటనలో సీసీ కెమెరాల నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించారంటూ గత ఈవో చక్రధరరావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన ఈవోగా ఎర్రంశెట్టి బాధ్యతలను తీసుకున్నారు.

కాగా మరోవైపు రథం ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ఘటనలో రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానంగా ఉందని, ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విచారణలో ఎవరు దోషులుగా తేలినా.. అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని అన్నారు. కావాలనే మతాల మధ్య చిచ్చు పెట్టాలని విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. అయితే అంతర్వేది ఆలయంలో 60ఏళ్ల నాటి రథం ఆదివారం దగ్ధమైంది. దీనిపై ఏపీలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read more:

సుశాంత్‌ డ్రగ్స్‌ అడిక్ట్ కాదు: ప్రత్యక్ష సాక్షి

అఖిల్‌తో సురేందర్ రెడ్డి మూవీ.. అధికారిక ప్రకటన