ఏపీలో ఈ నెల 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు

| Edited By:

Sep 12, 2020 | 7:15 AM

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 21 నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే విజయవాడ, విశాఖపట్టణంలో

ఏపీలో ఈ నెల 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు
Follow us on

Andhra Pradesh City services: లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 21 నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే విజయవాడ, విశాఖపట్టణంలో సిటీ బస్సులు ప్రారంభం కాలేదు. ఇక ఈ బస్సు సర్వీసులను ఈ నెల 20 నుంచి నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాత పరీక్షలు ఉండగా.. 10 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. ఈ క్రమంలో అందుకు తగ్గట్లుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ క్రమంలో 20 నుంచి సిటీ బస్సు సర్వీసులను తిప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ, సిద్ధం చేసిన ప్రణాళికను వైద్యారోగ్య ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుమతి కోసం  పంపింది. ఏపీ సీఎస్ నీలం సాహ్నితో కలిసి జవహర్‌ రెడ్డి నిర్ణయం తీసుకొని సిటీ బస్సు సర్వీసులకు అనుమతిని ఇస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Read More:

ఈ రోజు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు..

గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెరిగిన పెట్టుబడులు