గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెరిగిన పెట్టుబడులు

కరోనా వైరస్‌ కారణంగా ఒకవైపు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నప్పటికీ మరోవైపు బంగారంపై పెట్టుబడులు ఆగడం లేదని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా తాజాగా వెల్లడించింది...

గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెరిగిన పెట్టుబడులు
Follow us

|

Updated on: Sep 12, 2020 | 6:03 AM

బంగారం ధర ఓ రోజు కిందకి.. మరో రోజు పైకి అన్నట్టుగా కొనసాగుతూనే ఉంది. గతవారం తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. వారాంతంలో కాస్త పెరిగింది. ఇక. ఈవారం తొలి రోజు కాస్తపైకి కదిలింది. ఇలా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన యెల్లో మెటల్ ధర కాస్త కిందకి దిగివచ్చింది. ఓవైపు.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా… దేశీయంగా పసిడి ధర కాస్త తగ్గింది.. అయితే, ఇదే సమయంలో వెండి ధర మాత్రం మరింత ముందుకు కదిలింది.

బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గడంతో రూ.53,050కి దిగివచ్చింది. ఇక గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల జోరు కొనసాగుతున్నది. వరుసగా ఐదో నెల ఆగస్టులోనూ రూ.908 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కరోనా వైరస్‌ కారణంగా ఒకవైపు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నప్పటికీ మరోవైపు బంగారంపై పెట్టుబడులు ఆగడం లేదని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా తాజాగా వెల్లడించింది.