పురోహితుడి నోట.. బూతుల చిట్టా..!

రోజూ పవిత్రమైన మంత్రాలు చదివే పురోహితుడి నోట బూతు మాట..! కానీ ఎవరూ ఊహించని ఈ వైనం వరంగల్‌ జిల్లా నెక్కొండలో చోటుచేసుకుంది. సంయమనం పాటించాల్సిన ఓ పురోహితుడు, అతని తనయుడు రెచ్చిపోయారు. ఇది రోడ్డుపైనో, వారి ఇంట్లోనో కాదు.. ఓ వివాహ వేడుకలో అందరి ముందూ.. మరో తోటి పురోహితుడిపై బూతులు తిట్టారు. శివరామకృష్ణ అనే పురోహితుడు, అతని కొడుకు నెక్కొండలోని ఓ వివాహ ఫంక్షన్‌కు వెళ్లారు. వివాహం జరిపిస్తున్న రఘు అనే పురోహితుడిని దుర్భాషలాడుతూ, […]

పురోహితుడి నోట.. బూతుల చిట్టా..!
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2019 | 11:57 AM

రోజూ పవిత్రమైన మంత్రాలు చదివే పురోహితుడి నోట బూతు మాట..! కానీ ఎవరూ ఊహించని ఈ వైనం వరంగల్‌ జిల్లా నెక్కొండలో చోటుచేసుకుంది. సంయమనం పాటించాల్సిన ఓ పురోహితుడు, అతని తనయుడు రెచ్చిపోయారు. ఇది రోడ్డుపైనో, వారి ఇంట్లోనో కాదు.. ఓ వివాహ వేడుకలో అందరి ముందూ.. మరో తోటి పురోహితుడిపై బూతులు తిట్టారు.

శివరామకృష్ణ అనే పురోహితుడు, అతని కొడుకు నెక్కొండలోని ఓ వివాహ ఫంక్షన్‌కు వెళ్లారు. వివాహం జరిపిస్తున్న రఘు అనే పురోహితుడిని దుర్భాషలాడుతూ, అతనిపై చేయి చేసుకున్నారు. నెక్కొండలో ఏ శుభ కార్యక్రమం జరిగినా తానే చేయాలంటూ.. అలాంటిది తనని కాదని ఎలా వచ్చావని తండ్రీ, కొడుకులు దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతిథులను సైతం వారు దుర్భాషలాడారు. ఎంత నచ్చచెప్పినా ఆ తండ్రి, కొడుకులు వినకపోవడంతో కొంతమంది వారిని బయటకు తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.