సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌.. ఏపీ ప్రభుత్వం మరో బృహత్‌ కార్యం

| Edited By:

Aug 17, 2020 | 2:17 PM

మరో బృహత్‌ కార్యానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు

సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌.. ఏపీ ప్రభుత్వం మరో బృహత్‌ కార్యం
Follow us on

UPI based payment system in AP: మరో బృహత్‌ కార్యానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్ సహకారంతో ఇకపై సచివాలయాల్లో యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం గ్రామ/వార్డు సచివాలయాల్లో  35 శాఖల్లో 543 రకాల సేవలను ప్రభుత్వం అందిస్తుండగా.. వినియోగదారులు అవసరమైతే డిజిటల్ పేమెంట్‌ ద్వారా చెల్లింపులను చేయొచ్చు. దీనిపై ఎన్‌పీసీఐ సీఈఓ మాట్లాడుతూ.. డిజిటల్ విధానంతో ముందుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ అని అన్నారు. రాష్ట్రాల సాయంతోనే డిజిటల్ భారత్‌ సాధ్యమవుతుందని.. ఇందుకోసం ముందడుగు వేసిన సీఎం వైఎస్ జగన్‌కి కృతఙ్ఞతలని దిలీప్ వెల్లడించారు.

Read More:

రిటైర్మెంట్‌ ప్రకటించాక ధోని, నేను చాలా ఏడ్చాము: రైనా

48 గంటల్లో మోడల్ హౌస్‌.. ఏపీలో తొలిసారి