AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ ప్రియుడు..

విజయవాడలో ప్రేమ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి నేరుగా తన ప్రియుడు సాయి చందు వద్దకు వెళ్లి వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని అతడు చెప్పడంతో ఆమెను రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు.

Vijayawada: ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ ప్రియుడు..
Vijayawada Love Story
Shaik Madar Saheb
|

Updated on: Aug 27, 2026 | 9:02 PM

Share

ప్రేమించింది..! ప్రియుడి దగ్గరకు వెళ్లింది.. వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది.. కానీ.. ఇప్పుడే పెళ్లి కుదరదంటూ యువకుడు తేల్చిచెప్పాడు. కట్ చేస్తే.. యువకుడిపై యువతి తరపు బంధువుల దాడి..! విజయవాడ జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..! విజయవాడకు చెందిన ఓ యువతి.. కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంటి నుంచి బయటకు వచ్చింది. నేరుగా తన ప్రియుడు సాయి చందు దగ్గరకు వెళ్లింది. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి చేసింది. అయితే.. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం కుదరదంటూ సాయి చందు చెప్పాడు.

అయితే.. ప్రియుడు నచ్చజెప్పినా.. ఆమె ససేమిరా అంటూ మొండికేసింది..చివరకు.. యువతి పట్టువిడవకపోవడంతో.. ఆమెను రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాలని చెప్పాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో మాట్లాడాలని ప్రియుడు సాయి చందును పిలిచిన యువతి తరపు బంధువులు.. అతడిపై దాడి చేశారు.

మరోవైపు యువతి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు.. యువతిని గుంటూరు రైల్వే స్టేషన్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, విజయవాడలో సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ యువకుడు..
ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ యువకుడు..
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్! పాలకూర వడల సింపుల్ రెసిపీ ఇదిగో!
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్! పాలకూర వడల సింపుల్ రెసిపీ ఇదిగో!
శుభకార్యానికి బయలుదేరినప్పుడు వెనుక నుంచి పిలిస్తే.. అశుభమా?
శుభకార్యానికి బయలుదేరినప్పుడు వెనుక నుంచి పిలిస్తే.. అశుభమా?
చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా?
చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్పెషల్ బస్సులు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్పెషల్ బస్సులు
టార్గెట్‌ సురేఖేనా?.. ఖర్గే కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ!
టార్గెట్‌ సురేఖేనా?.. ఖర్గే కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ!
పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
ఒక్కో ఈవెంట్‏కు రెమ్యునరేషన్ ఎంత ఇస్తారంటే.. జబర్దస్త్ అప్పారా
ఒక్కో ఈవెంట్‏కు రెమ్యునరేషన్ ఎంత ఇస్తారంటే.. జబర్దస్త్ అప్పారా
నా ఆత్మీయ మిత్రుడి మరణం దిగ్భ్రాంతి కలిగించింది: చిరంజీవి
నా ఆత్మీయ మిత్రుడి మరణం దిగ్భ్రాంతి కలిగించింది: చిరంజీవి
ప్రియురాలితో బ్రేకప్.. కోపంతో పేపర్ లీక్ బయటపెట్టిన ప్రియుడు!
ప్రియురాలితో బ్రేకప్.. కోపంతో పేపర్ లీక్ బయటపెట్టిన ప్రియుడు!