AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం

ఏపీ, కర్ణాటక మధ్య రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై భారీ సొరంగాన్ని నిర్మిస్తోంది. నెల్లూరు జిల్లా సీతారామపురం నుంచి కడప జిల్లా వరకు వేర్వేరుగా సొరంగ మార్గాల నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. వీటిలో ఒక్కో టన్నెల్‌ 3.68 కిలోమీటర్ల పొడవు ఉండేలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సీతారామపురంలో ఈ నిర్మాణ పనులు పుంజుకున్నాయి.

జస్ట్ 6 గంటలే.. విజయవాడ- బెంగళూరు మధ్య కొత్త హైవే.. తగ్గనున్న 130KM దూరం
Vijayawada Bengaluru Greenfield Expressway
Anand T
|

Updated on: Aug 28, 2026 | 8:26 AM

Share

విజయవాడ – బెంగళూరు మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్ హైవే – 544జీ పనుల్లో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. మొత్తం ఆరు వరుసల్లో (6 లేన్లు) 518 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించబోతున్నారు. ఈ హైవే విజయవాడ నుంచి ప్రారంభమై గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా కడప జిల్లాకు చేరుకుంటుంది. అయితే, ఈ హైవేపై అధికారులు సొరంగ మార్గాలను కూడా నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం నుంచి కడప జిల్లా వరకు వేర్వేరుగా రెండు సొరంగాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రెండింటి మధ్య మొత్తం 7.5 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించనున్నారు. రూ.801 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 2025లో అనుమతులు లభించగా, గత జూన్‌ నెలలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

కాంట్రాక్ట్ సంస్థ ప్రకారం.. ఈ హైవేపై నిర్మించబోయే ఒక్కో టన్నెల్ సుమారు 3 కిలోమీటర్లకు పైనే ఉండనుంది. అలాగే 16.7 మీటర్ల వెడల్పు, 10.4 మీటర్ల ఎత్తుతో వీటిని నిర్మించనున్నట్లు స్పష్టం చేసింది. కాంక్రీట్‌ లైనింగ్‌ పూర్తయిన తర్వాత ఇవి 14.7 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల ఎత్తుతో ఉంటాయని పేర్కొంది. 2027 నాటికి కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తి చేసి, అదే సంవత్సరం డిసెంబర్ నాటికి సొరంగాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కాంట్రాక్ట్ సంస్థ తెలిపింది.

ఇకపోతే, తాజాగా నిర్మిస్తున్న ఈ 6 లేన్ల నేషనల్ హైవేను నెల్లూరు జిల్లా సీతారామపురం మీదుగా తీసుకెళ్లి 167 బీజీ, 167 బి హైవేలకు అనుసంధానిస్తారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడికొండ వద్ద ప్రారంభమై కడప, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రకాశం జిల్లా ముప్పవరం వద్ద నేషనల్ హైవే-16తో కలుస్తుంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాల ప్రవేశ (ఎంట్రీ), నిష్క్రమణ (ఎగ్జిట్‌) మార్గాలు మారనున్నాయి. ప్రయాణికులు కేవలం 13 ప్రాంతాల్లో మాత్రమే ఈ హైవేపైకి ప్రవేశించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇక రూ.6 వేలకే మీ ఇల్లు సినిమా థియేటర్.. స్పెషల్ ఆఫర్
ఇక రూ.6 వేలకే మీ ఇల్లు సినిమా థియేటర్.. స్పెషల్ ఆఫర్
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ
నదిలో నీరు లేక గంగాళాల్లో కూర్చుని వరుణ జపం.. అర్చకుల వినూత్న పూజ