Chalo Tadepalli: ఆంధ్రప్రదేశ్‌లో CPS రద్దు పోరు మరోసారి షురూ.. రేపు తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడి..

|

Apr 24, 2022 | 10:20 PM

UTF Chalo Tadepalli: ఆంధ్రప్రదేశ్‌లో CPS రద్దు పోరు మరోసారి షురూ అయ్యింది. CPS రద్దుపై స్పష్టమైన హామీ కోసం డిమాండ్‌ చేస్తున్నారు యూటీఎఫ్‌ నేతలు. CPS రద్దు చేస్తామంటూ అధికారంలోకొచ్చి, ఇప్పుడు సాకులు చెబితే కుదరదంటున్నాయి..

Chalo Tadepalli: ఆంధ్రప్రదేశ్‌లో CPS రద్దు పోరు మరోసారి షురూ.. రేపు తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడి..
Chalo Tadepalli
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో CPS రద్దు పోరు మరోసారి షురూ అయ్యింది. CPS రద్దుపై స్పష్టమైన హామీ కోసం డిమాండ్‌ చేస్తున్నారు యూటీఎఫ్‌ నేతలు. CPS రద్దు చేస్తామంటూ అధికారంలోకొచ్చి, ఇప్పుడు సాకులు చెబితే కుదరదంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. CPS రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పోరుగర్జనకు పిలుపునిచ్చిన యూటీఎఫ్‌, తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడిస్తామని చెబుతోంది. అరెస్టులు చేసినా, కట్టడి చేసినా సీఎం నివాసాన్ని ముట్టడించి తీరుతామంటున్నారు ఉపాధ్యాయులు. CPS రద్దుపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందొన్నది యూటీఎఫ్‌ ప్రధాన ఆరోపణ. చర్చల పేరుతో మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే పన్నెండుసార్లు ప్రభుత్వంతో చర్చించినా ఫలితం శూన్యం అంటున్నారు ఉపాధ్యాయులు.

మళ్లీ చర్చలు జరిపినా ఇదే రిపీట్‌ అవుతుందని, తమకు చర్చలు కాదు, స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. యూటీఎఫ్ పోరుగర్జనతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

తాడేపల్లి వైపు రాకుండా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను నిర్బంధిస్తున్నారు. యూటీఎఫ్‌ నేతల వార్నింగ్స్‌, పట్టుదల చూస్తుంటే విజయవాడ మరోసారి రణరంగంగా మారే సిట్యువేషన్‌ కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..

Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..