Andhra Pradesh: నేడు ఏపీకి రానున్న కేంద్ర మంత్రి షెకావత్.. రేపు సీఎం జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శనం

|

Mar 03, 2022 | 6:55 AM

Shekhawat Tour In Andhra Pradesh: కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్(central minister gajendra singh shekhawat) నేడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. రెండు రోజుల పాటు..

Andhra Pradesh: నేడు ఏపీకి రానున్న కేంద్ర మంత్రి షెకావత్.. రేపు సీఎం జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శనం
Gajendra Singh Shekhawat
Follow us on

Shekhawat Tour In Andhra Pradesh: కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్(central minister gajendra singh shekhawat) నేడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. రెండు రోజుల పాటు షెకావత్ పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 7.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాసానికి  కేంద్రమంత్రి షెకావత్ చేరుకోనున్నారు. రాత్రి సీఎం జ‌గ‌న్ ఇచ్చే విందును స్వీక‌రించ‌నున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు శుక్ర‌వారం (మార్చి 4న) సీఎం జగన్ తో కలిసి  వెళ్ల‌నున్నారు.  పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా జలశక్తి మంత్రి తన పర్యటనను ప్రారంభిస్తారని వర్గాలు తెలిపాయి. అనంతరం చేపల నిచ్చెన పనులు, గైడ్ బండ్ పనులను సందర్శిస్తారు. ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పనులపై మంత్రి చర్చించనున్నారు. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ డయా ఫ్రమ్‌ వాల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పరిశీలించనున్నారు.

ఈ షెడ్యూల్ ప్ర‌కారం..రాత్రి బ‌స అనంత‌రం సీఎం జగన్ తో కలిసి పోలవరం ప్రాజెక్టులోని నిర్వాసిత కాలనీలు, ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద పీపీఏ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత పోలవరం పర్యటనను ముగించుకుని విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంత‌రం శుక్ర‌వారం రాత్రి ఆయ‌న ఢిల్లీ తిరుగు ప్ర‌యాణం కానున్నారు.

Also Read:

: ఈరోజు ఈ రాశివారు ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..