Andhra Pradesh: పామును రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన మామ, అల్లుళ్లు..!

| Edited By: Balaraju Goud

Nov 17, 2024 | 12:52 PM

బావిలోనే మధుసూదానరావు(55) కుప్పకూలిపోయాడు. వెంటనే మధుసూదనరావు ను రక్షించే ఉద్దేశంతో బయట ఉన్న అతని మేనల్లుడు కింతలి వినోద్(20) బావిలోకి దిగాడు.

Andhra Pradesh: పామును రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన మామ, అల్లుళ్లు..!
Snake In Well
Follow us on

మృత్యువు ఎప్పుడు, ఎక్కడ ఎవరికి, ఎలా రాసిపెట్టి ఉంటుందో ఎవరికి తెలియదు. మృత్యు ఘడియలు వచ్చాయంటే చాలు ఎటువంటి బంధాన్ని అయిన ఇట్టే తెంపేసి ఎంతటి వారినైనా తీసుకుపోతుంది. బాధిత కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చనిపోయిన ఓ పాము రూపంలో మృత్యువు వచ్చి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామం శనివారం తీవ్ర కన్నీటి పర్యంతం అయింది. గ్రామంలోని రఘుపాతృని మధుసూదనరావు(55) అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న బావిలో ఒక పాము పడిపోయి చనిపోయింది. అది గమనించి బావిని క్లీన్ చేయాలన్న ఉద్దేశ్యంతో బావి వద్ద మోటార్ ను ఏర్పాటు చేసి బావిలోని నీటిని బయటకు తోడిoచేసారు. అయితే ఈ క్రమంలో తాడు తెగిపోయి మోటారు బావిలో పడిపోయింది. బావిలో పడిపోయిన మోటార్‌ను బయటకు తీసేందుకు బావిలో నిచ్చెన వేసి లోపలకు దిగాడు మధుసూదనరావు.

అయితే బావిలోకి వెళ్ళాక లోపల ఆక్సిజన్ లేక ఊపిరి ఆడలేదు. దాంతో బావిలోనే మధుసూదానరావు కుప్పకూలిపోయాడు. బయట ఉన్న వారు అది గమనించారు. వెంటనే మధుసూదనరావు ను రక్షించే ఉద్దేశంతో బయట ఉన్న అతని మేనల్లుడు కింతలి వినోద్(20) బావిలోకి దిగాడు. వినోద్ కి కూడా అతని మేనమామకు ఎదురైనా పరిస్థితే ఎదురైంది. అతనికి లోపల ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యి బావిలో కుప్పకూలిపోయాడు. వెంటనే బయట నుంచి అదంతా గమనించిన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు బావిలో కుప్పకూలిపోయిన ఇద్దరిని బయటకు తీశారు. అయితే అప్పటికే వారు చనిపోయారు. దీంతో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వారి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు మృతి చెందటం పైగా వారిద్దరూ మేనమామ, మేనల్లుడు కావటంతో ఇరు కుటుంబాలలోను, గ్రామంలోను తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..